ISRO PSLV-C60 Launched: అంతరిక్షంలో ట్రాఫిక్... 2 నిమిషాలు ఆలస్యంగా పీఎస్ఎల్‌వి-సీ60 ప్రయోగించిన ఇస్రో

ISRO PSLV-C60 Launched, ISRO’s SpaDeX mission: అంతరిక్షంలో శాటిలైట్స్ కదలికల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని పసిగడుతూ మరో రెండు నిమిషాలు ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు ( 2 Minutes delay in SpaDeX mission launch due to Traffic jam in space) సోమవారం మధ్యాహ్నం తరువాతే ప్రకటించింది.

Update: 2024-12-30 16:39 GMT

ISRO PSLV-C60 Launched, ISRO’s SpaDeX mission: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్‌వి-C60 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. ఈ ప్రయోగంతో స్పెస్ డాకెట్ ఎక్స్‌పరిమెంట్ (Space Docking Experiment (SpaDeX)) చేసిన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. 

Full View

అంతరిక్షంలో స్పేస్ డాకింగ్ టెక్నాలజీ సేవలు, హ్యూమన్ స్పేస్‌క్రాఫ్ట్స్, చంద్రుడిపై చేసే ప్రయోగాలతో పాటు భవిష్యత్‌లో తలపెట్టనున్న భారతీయ అంతరిక్ష్ స్టేషన్ ప్రయోగాలకు ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్‌పరిమెంట్ మిషన్ ఎంతగానో ఉపయోగపడనుందని ఇస్రో (ISRO’s SpaDeX Mission) ప్రకటించింది. 

ఇస్రో ఈ ప్రయోగాన్ని మొదట రాత్రి 9:58 నిమిషాలకే షెడ్యూల్ చేసింది. కానీ అంతరిక్షంలో శాటిలైట్స్ కదలికల కారణంగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉందని పసిగడుతూ మరో రెండు నిమిషాలు ఆలస్యంగా ప్రయోగిస్తున్నట్లు ( 2 Minutes delay in SpaDeX mission launch due to Traffic jam in space) సోమవారం మధ్యాహ్నం తరువాతే ప్రకటించింది. చెప్పిన టైమ్ ప్రకారమే రాత్రి 10 గంటలకు ఇస్రో స్పేస్ డాకింగ్ మిషన్ శాటిలైట్స్‌ను మోసుకెళ్తున్న పీఎస్ఎల్‌వి-C60 రాకెట్‌ను ప్రయోగించింది.

ఈ ప్రయోగం విజయవంతమైందని, రెండు శాటిలైట్స్‌ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం జరిగిందని ఇస్రో ప్రకటించింది. పీఎస్ఎల్‌వి-C60 రాకెట్‌ (ISRO PSLV-C60) ప్రయోగం విజయవంతం అవడంతో ఇస్రోలో శాస్త్రవేత్తలకు న్యూ ఇయర్ సంబరాలు ఒకరోజు ముందే వచ్చేశాయి. 

Tags:    

Similar News