AI School Teacher: విద్యా విధానంలోకి AI ప్రవేశం.. పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ

AI School Teacher: టీచర్లు పాఠాలు బోధించే విధానం కనుమరుగు కానుందా...? విద్యా బోధనలోకి వస్తున్న ఆధునిక సాంకేతిక ఏంటి..?

Update: 2024-05-27 08:45 GMT

AI School Teacher: విద్యా విధానంలోకి AI ప్రవేశం.. పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ

AI School Teacher: టీచర్లు పాఠాలు బోధించే విధానం కనుమరుగు కానుందా...? విద్యా బోధనలోకి వస్తున్న ఆధునిక సాంకేతిక ఏంటి..? దేశంలో ఉన్న లక్షలాది ఉపాధ్యాయులు ఇంటిబాట పట్టాల్సిందేనా...? బడి పంతుళ్లను అంతగా భయపెడుతున్న ఆ సాంకేతికత ఏంటి...‌?

నాడు ఆశ్రమాలు, గురుకులాల్లో గురువుల సమక్షంలో శిష్యుల విద్యాబోధన పొందేవారు. నేడు విద్యాలయాలు, కార్పొరేట్ , ప్లే స్కూల్, ఇంటర్నేషనల్ పోకడలతో చదువు చెబుతున్నారు. విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో విద్యా బోధన చేస్తున్నారు. కరోనా టైమ్‌లో ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించారు.

దేశంలో మరింత సాకేంతికతతో ముందుకు వస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. AI అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ అందరిని కలవర పెడుతోంది. తాజాగా విద్యా రంగంలోకి AI ప్రవేశించింది. గౌహతిలో AI టీచర్ ఐరిస్‌ను రాయల్ గ్లోబల్ స్కూల్ ఆవిష్కరించింది. సాంప్రదాయ వస్త్రధారణతో ఐరిస్ ఎంతగానో ఆకట్టుకుంది. విజ్ఞానం, ఇంటరాక్టివ్ సామర్థ్యాలతో విద్యార్థులను ఆకర్షించింది. తరగతి గది అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది.

రాయల్ గ్లోబల్ స్కూల్‌లో ఐరిస్ ప్రారంభ సెషన్ జరిపారు. విద్యను అందించడంలో ఐరిస్ సామర్థ్యానికి విద్యార‌్థులు మంత్రముగ్ధులయ్యారు. హిమోగ్లోబిన్‌ గురించి ఓ విద్యార్థి ప్రశ్నకు ఐరిస్ వివరణాత్మక వివరణలు, ఉదాహరణలు, సూచనలు అందించింది.

సిలబస్, సంబంధిత ప్రశ్నలకు సమాధానాలతో పాటు విస్తృతమైన అంశాలకు ఐరిస్ తన వేగవంతమైన ప్రతిస్పందనలతో ఆకట్టుకుంది. షేక్ హ్యాండ్ వంటి సంజ్ఞలను ప్రదర్శించడం, అభ్యాస అనుభవాన్ని పెంపొందించడం, తరగతి గదిలో స్నేహభావాన్ని పెంపొందించడం వంటి ఐరిస్ నైపుణ్యతకు విద్యార్థులు ఆనందించారు.

విద్యా రంగంలోకి AI ప్రవేశం హర్షించే విష‍యమని సాంకేతిక నిపుణులు, పేరెంట్స్ అంటుండగా.... తమ ఉద్యోగాలకు ఎసరు తప్పదని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News