RBI: పరిస్థితి ఇలాగే ఉంటే, ప్రైవేట్ బ్యాంకులకు ఉద్యోగులెవరూ దొరకరు.. ఆర్బీఐ హెచ్చరిక

Update: 2024-12-30 13:41 GMT

RBI Warning to Private banks: ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదిలి వెళ్లడం లేదా మారే వారి రేటు దాదాపు 25 శాతం పెరిగింది. అందువల్ల, ఉద్యోగుల మార్పిడి రేటు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కార్యాచరణ ప్రమాదాలను సృష్టిస్తుంది. ఇది భారతదేశంలో 2023-24 బ్యాంకింగ్ ట్రెండ్, పురోగతిపై ఉంటుందని తాజా నివేదికలో పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎంపిక చేసిన ప్రైవేట్ రంగ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBs)లో ఉద్యోగుల అట్రిషన్ రేటు ఎక్కువగా ఉంది. ప్రైవేట్ బ్యాంకుల మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023-24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSB) కంటే ఎక్కువగా ఉంటుందని నివేదిక చెబుతోంది. అయితే గత మూడేళ్లలో వారి ఉద్యోగుల ఉద్యోగ మార్పిడి రేటు వేగంగా పెరిగింది. ఇది సగటున 25 శాతానికి చేరుకుంది.

అటువంటి పరిస్థితి కస్టమర్ సేవల్లో అంతరాయం సహా గణనీయమైన కార్యాచరణ ప్రమాదాలను కలిగిస్తుందని ఆర్బీఐ నివేదిక పేర్కొంది. ఇది కాకుండా రిక్రూట్‌మెంట్ ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయి. బ్యాంకులతో జరిపిన చర్చల్లో, ఉద్యోగులు ఉద్యోగాన్ని విడిచిపెట్టే ధోరణిని తగ్గించడం కేవలం మానవ వనరుల పని కాదని, వ్యూహాత్మక అవసరమని రిజర్వ్ బ్యాంక్ నొక్కిచెప్పింది. సమగ్ర శిక్షణ, కెరీర్ డెవలప్‌మెంట్ అవకాశాలను అందించడం, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌లు, పోటీ ప్రయోజనాలు, దీర్ఘకాలిక ఉద్యోగుల ఎంగేజ్‌మెంట్ కోసం మంచి ఆఫీసు సంస్కృతి వంటి వ్యూహాలను బ్యాంకులు అమలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

బ్యాంకుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం

బంగారు ఆభరణాలపై (టాప్-అప్ లోన్‌లతో సహా) రుణాల మంజూరులో అనేక అవకతవకలను గమనించిన దృష్ట్యా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి విధానాలు, బంగారు రుణాలపై పద్ధతులను సమగ్రంగా సమీక్షించవలసిందిగా ఆయా కార్యకాపాలను పర్యవేక్షించే సంస్థలకు సూచించింది. తద్వారా లోపాలను గుర్తించి తగిన దిద్దుబాటు చర్యలు సకాలంలో ప్రారంభించవచ్చని ఆర్బీఐ అభిప్రాయపడింది. 

Tags:    

Similar News