Heavy Rains in Kerala: కేరళలో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండచర్యలు ఐదుగురు మృతి..
Heavy Rains in Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.
Heavy Rains in Kerala: కేరళలోని ఇడుక్కి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పర్యాటక పట్టణం మున్నార్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నకేరళ జిల్లాలోని రాజమలై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు.. ఈ ప్రాంతంలో 70 నుంచి 80 మంది ప్రజలు నివసించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ సమయంలో ఎంత మంది బురద కింద చిక్కుకున్నారో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.
ఘటన జరిగిన ప్రాంతంలోని వంతెన కొట్టుకుపోయిందని.. ఈ ప్రాంతానికి చేరుకోవటం కష్టమని అధికారులు తెలిపారు. అంతేకాదు, కటినమైన భూభాగాలతో రెస్క్యూ బృందాలు కూడా తమ సాయశక్తుల ప్రయత్నాలు పనిచేస్తున్నారని వెల్లడించారు. స్థానిక రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఐదుగురు మరణించినట్లు.. ఇప్పటివరకు సుమారు 10 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.
అటవీ అధికారులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం IAF హెలికాప్టర్ల సహాయం కోరింది. స్థానిక రెవెన్యూ అధికారుల ప్రారంభ నివేదికలు ఉదయం 11.30 గంటలకు ఐదుగురు మరణించినట్లు సూచిస్తున్నాయి. ఇప్పటివరకు మరో పది మందిని రక్షించారు.
అటవీ అధికారులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం IAF హెలికాప్టర్ల సహాయం కోరింది. "రాజమలై, ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడగానే ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని నియమించారు. సహాయక చర్యల్లో చేరాలని పోలీసులు, అగ్నిమాపక దళం, అటవీ, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వబడ్డాయి. త్రిస్సూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్‌డిఆర్‌ఎఫ్ మరో బృందం త్వరలో ఇడుక్కి చేరుకుంటుంది." ముఖ్యమంత్రి పినరయి విజయన్ త్వీట్ చేసారు.
మరోవైపు గత కొద్ది రోజులుగా ముంబైలో ముంబైలో భారీ వర్షాలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలన్నీ జలమయమయి మరో సముద్రాన్ని తలసిస్తున్నాయి. వరద నీరుపూర్తిగా రోడ్లపై చేరడంతో జనజీవనం, రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించి పోయింది దీనితో ముంబయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. చెంబూర్, పరేల్, హింద్మాత, వడాలా సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ముంబై నగరానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
An NDRF team has been deployed to rescue the landslide victims in Rajamalai, Idukki.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) August 7, 2020
Police, Fire Force, Forest & Revenue officials have been instructed to join the rescue efforts.
Another team of NDRF, based in Thrissur, will soon reach Idukki.#KeralaRains