కేరళలో భారీ వర్షాలు... 11 మంది మృతి

Kerala: గత రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు

Update: 2024-05-25 09:47 GMT

కేరళలో ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. 11 మంది మృతి

Kerala: ఉత్తర భారతదేశం వడగాలులకు అల్లాడిపోతుండగా.. దక్షిణాది రాష్ట్రమైన కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరువనంతపురం, కొచ్చి, త్రిస్సూర్‌, కోజికోడ్‌, ఎర్నాకులం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్‌, మలప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌ సహా పలు ప్రధాన నగరాలు పూర్తిగా జలమయమయ్యాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకులం, కోజికోడ్‌, కన్నూర్‌, కాసర్‌గోడ్‌ జిల్లాలకు ఐఎండీ ఎల్లో హెచ్చరికలు ఇచ్చింది.

ఈ జిల్లాల్లో 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు భారీ వర్షం కారణంగా కేరళ వ్యాప్తంగా 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి కె.రాజన్‌ తెలిపారు. మే 9 నుంచి 23 వరకూ ఈ మరణాలు నమోదైనట్లు చెప్పారు. 11 మందిలో ఆరుగురు నీటిలో గల్లంతై మరణించగా.. క్వారీ ప్రమాదంలో ఇద్దరు, పిడుగుబాటుకు ఇద్దరు, ఇల్లు కూలి ఒకరు మరణించినట్లు వెల్లడించారు. ప్రజలు అప్రమగత రెండు రోజులుగా కేరళలో ఎడతెరిపి లేని వర్షాలుత్తంగా ఉండాలని కోరారు. నీటి ప్రవాహాలు, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

Tags:    

Similar News