Covid-19 Effect on Ganesh Chaturthi: కరోనా నేపథ్యంలో ఈసారి గణేష్ ఉత్సవాలకు దూరం

Covid-19 Effect on Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే

Update: 2020-07-01 10:53 GMT

Covid-19 Effect on Ganesh Chaturthi: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ రాష్ట్రాల నుంచి రోజురోజుకి రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి.. దీనితో ఇప్పటికే చాలా పండుగలను ఇంట్లోనే జరుపుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి.. ఇక త్వరలో గణేష్ చతుర్థి వస్తుండడంతో మహారాష్ట్ర ఈ ఏడాది గణేష్ ఉత్సవాలకి దూరంగా ఉండనుంది. కరోనా ఎఫెక్ట్‌తో ఈ సారి గణేష్ ఉత్సవాల్ని నిర్వహించడం లేదు..

నిజానికి గణేష్ ఉత్సవాలు అంటేనే ముంబాయి... అక్కడ గణేష్ వేడుకలు చాలా ఘనంగా నిర్వహిస్తారు.. చాలా మంది ఈ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు.. ప్రస్తుతం అక్కడ కరోనా వైరస్ కేసులు తీవ్రంగా పెరుగుతుండడంతో..గణేశ్‌ ఉత్సవాలు నిర్వహించమని లాల్‌ బాగుచా రాజా గణేశ్‌ ఉత్సవ్‌ మండల్‌ కమిటీ తెలిపింది. ఆ స్థానంలో రక్తం, ప్లాస్మా దానం క్యాంపులను ఏర్పాటు చేస్తామని చెప్పింది. గత ఏడాది ఎక్కడ చంద్రయాన్2 ఆకారంలో గణేష్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ముంబై తర్వాత గణేష్ వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించేది హైదరాబాదులోనే.. హైదరాబాదులోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఏర్పాట్లు ఇప్పటికి మొదలయ్యాయి. మే 18న తొలిపూజ ప్రారంభించి విగ్రహ పనులను మొదలు పెట్టేశారు. కరుణ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నట్టుగా ఉత్సవ కమిటీ తెలిపింది..

ఇక భారత్ లో కరోనా కేసుల లెక్కలు ఒక్కసారిగా చూసుకుంటే.. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,653 కేసులు నమోదు కాగా, 507 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 5,85,493 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,20,114 ఉండగా, 3,47,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,400 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,17,931 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 88,26,585 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News