ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా రాష్ర్టానికి రానే వచ్చింది. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమానశ్రయానికి తరలించారు. 31 బాక్సుల్లో 3.72 లక్షల డోసుల వ్యాక్సిన్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆ బాక్సులను కోఠిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రానికి తరలిస్తున్నారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక కంటైనర్‌లో తరలించనున్నారు. దీని కోసం వ్యాక్సిన్ నిల్వ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 44 క్యూబిక్ మీటర్ సామర్థ్యం కలిగిన ప్రత్యేక ఫ్రీజర్‌లను అధికారులు ఏర్పాటు చేశారు. కోఠి నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి విడతగా 2.90 లక్షల మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందజేయనున్నారు.