Delhi: ఢిల్లీపైకి చైనా 'లాంగ్‌ మార్చ్‌' ?

Delhi: అదుపు తప్పిన రాకెట్‌ హస్తినపై పడే అవకాశం

Update: 2021-05-07 06:23 GMT

చైనా లాంగ్ మార్చ్ B రాకెట్ (ఫైల్ ఇమేజ్)

Delhi: ఇప్పటికే చైనా వదలిన వైరస్‌ ప్రపంచాన్ని ఆగం చేస్తోంది. ఇప్పుడు అదుపు తప్పిన చైనా రాకెట్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తుంది. మరో 24 గంటల్లో భూమిని తాకే ప్రమాదముందని అమెరికా రక్షణశాఖ హెచ్చరిస్తోంది. అయితే ఆ రాకెట్‌ ఏ దేశంలో పడుతుందో అని అన్ని దేశాలు టెన్షన్‌ పడుతున్నాయి. అది నేరుగా భారత రాజధాని ఢిల్లీపైనే పడుతుందని అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రజ్ఞుడు జొనాథన్‌ మెక్‌డోవెల్‌ అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ మిస్‌ అయితే బీజింగ్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ, బ్రెజిల్‌లోని రియో డీ జెనీరియా నగరాలపై పడే చాన్స్ ఉందని చెబుతున్నారు.

చైనా చర్యలు బెడిసికొట్టి ప్రపంచానికే ముప్పు తెస్తున్నాయి. లేనిపోని చెత్త తిని మానవ లోకానికి వైరస్‌తో మంట పెట్టారు. ఇదీ చాలదన్నట్టు ఇప్పుడు లాంగ్‌ మార్చ్‌ 5బీ' రాకెట్‌ను ప్రయోగించి మరో గండం తీసుకువచ్చారు. గొప్పలకుపోయే చైనా లాంగ్ మార్చ్ రాకెట్‌ను ప్రయోగించింది. అది నింగిలోకి వెళ్లాక అదుపు తప్పింది. దాన్ని కంట్రోల్‌ చేయలేక చైనా చేతులు ఎత్తేసింది. ఇప్పుడా ఆ రాకెట్‌ భూమిపైకి దూసుకువస్తుంది. అది ఇప్పుడు ఏ దేశంపై పడుతుందో అని సైంటిస్టులందరూ తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ రాకెట్‌ సెకనుకు 4 మైళ్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తోందని, భూమధ్యరేఖకు ఉత్తర, దక్షిణ భాగాలలో 41 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఎక్కడైనా లాంగ్‌ మార్చ్‌ 5బీ కుప్పకూలొచ్చన్నారు. అయితే దాన్ని అదుపులోకి తీసుకొని, నిర్జన ప్రదేశాల వైపు మళ్లించే ప్రయత్నాల్లో చైనా నిమగ్నమై ఉండొచ్చని జొనాథన్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 

Tags:    

Similar News