Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది

Rahul Gandhil: మోడీ సర్కార్‌ తీరుపై రాహుల్ ఫైర్

Update: 2022-12-16 16:00 GMT

Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే ప్రభుత్వం నిద్రపోతోంది

Rahul Gandhil: చైనా యుద్ధానికి సిద్ధమ‌వుతున్నా మ‌న ప్రభుత్వం దాన్ని అంగీక‌రించ‌డం లేద‌ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. వాస్తవాల‌ను మోడీ స‌ర్కార్ దాచేస్తోంద‌ంటూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. భార‌త్‌-చైనా స‌రిహ‌ద్దు వివాదం విష‌యంలో త‌లెత్తిన‌ సందేహాల‌ను కేంద్రం నివృత్తి చేయ‌డం లేద‌ని రాహుల్ కామెంట్ చేశారు. ల‌డ‌ఖ్‌, అరుణాచ‌ల్ వైపున యుద్ధానికి డ్రాగ‌న్ సిద్ధమ‌వుతుంటే.. భార‌త ప్రభుత్వం నిద్రపోతోంద‌ని విమర్శించారు రాహుల్.

Tags:    

Similar News