Home Isolation: పది నుంచి ఏడు రోజులకు తగ్గిన హోం ఐసోలేషన్
Home Isolation: హోం ఐసోలేషన్‌కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది
Home Isolation: హోం ఐసోలేషన్‌కు సంబంధించి సవరించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీని ప్రకారం కరోనా సోకినవారు ఇకపై పది రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండాల్సిన పనిలేదు. కరోనా సోకినట్టు నిర్ధారణ అయిన తర్వాత 7 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని తెలియజేసింది. ఏడు రోజుల్లో వరుసగా మూడ్రోజులపాటు జ్వరం రాకుంటేనే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఐసోలేషన్ ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసింది.
వరుసగా మూడ్రోజులపాటు వంద డిగ్రీలకు మించి జ్వరం ఉన్నా గంటలోపు ఆక్సిజన్ స్థాయి 93 శాతం కంటే కిందికి పడిపోయినా, చాతిలో నొప్పి, ఒత్తిడి ఉన్నా, శ్వాసరేటు పడిపోయినా, అలసటగా ఉన్నా వెంటనే వైద్యసాయం తీసుకోవాలని సూచించింది. రోగి హోం ఐసోలేషన్‌లో ఉంటే ఇంట్లోని మిగతావారు కూడా హోం క్వారంటైన్ మార్గదర్శకాలను పాటించాలంది. సొంత వైద్యం చేసుకోకూడదని తెలిపింది.