Covaxin: టీకా ఉత్పత్తి కోసమే ఇతర కంపెనీలకు కోవాగ్జిన్‌ ఫార్ములా: కేంద్రం

Covaxin: కరోనావైరస్ కట్టడి కోసం సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది.

Update: 2021-05-13 13:05 GMT

కోవాగ్జిన్‌ (ఫొటో ట్విట్టర్) 

Covaxin: కరోనావైరస్ కట్టడి కోసం సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది. మే 1 నుంచి మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా ప్రారంభించింది. ఇందులో 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా వేయాలని ప్లాన్ చేసింది. కానీ, వ్యాక్సిన్ కొరతతో ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు.

ప్రస్తుతం సెకండ్ డోస్ టీకాను మాత్రమే అందిస్తున్నారు. ఈ మేరకు వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. కోవాగ్జిన్‌ ఫార్ములాను మరికొన్ని కంపెనీలకు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉత్పత్తి వేగవంతం కానుంది.

Tags:    

Similar News