Assam: అసోం సీఎంపై హత్యాయత్నం కేసు

Assam: కేసు నమోదు చేసిన మిజోరాం పోలీసులు * ఇటీవల అసోం, మిజోరాం సరిహద్దుల్లో ఘర్షణలు

Update: 2021-07-31 05:46 GMT

అస్సాం సీఎం హిమంతా విశ్వా శర్మ (ఫైల్ ఇమేజ్)

Assam: అసోం, మిజోరం సరిహద్దు ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఇటీవలే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఘర్షణలు జరగగా.. అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు చనిపోయారు. 50 మందికిపైగా పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘర్షణలకు మీరంటే మీరంటూ రెండు రాష్ట్రాలు పరస్పర ఆరోపణలు చేసుకోగా.. తాజాగా అసోం సీఎంపై మిజోరాంలో కేసు నమోదైంది. దీంతో వివాదం మళ్లీ ముదిరేలా కనిపిస్తోంది.

అసోం, మిజోరాం సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలపై మిజోరాంకు చెందిన మిజో జిర్లై పాల్ అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్‌ ఫిర్యాదు చేసింది. దీంతో అసోం సీఎం సహా ఆరుగురు ఉన్నతాధికారులపై వైరాంగ్టే పోలీస్ స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది. సీఎం హిమంత విశ్వశర్మపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మరోవైపు సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో కోలాసిబ్ జిల్లా ఎస్పీ పాత్ర ఉందంటున్న అసోం బోర్డర్‌కు చెందిన ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Tags:    

Similar News