Jammu and Kashmir Assembly Election 2024: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

44 మందితో మూడు దశలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతకు 15 మంది, రెండో విడతకు 10 మంది, మూడో విడతకు 19 మంది అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది.

Update: 2024-08-26 05:57 GMT

Jammu and Kashmir Assembly Election 2024: బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Jammu and Kashmir Assembly Election 2024: జమ్ముకశ్మీర్‌లో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 44 మందితో మూడు దశలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతకు 15 మంది, రెండో విడతకు 10 మంది, మూడో విడతకు 19 మంది అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది. జమ్ముకశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 18న తొలి విడత, 25న రెండో విడత, అక్టోబర్ 1న మూడో విడత ఎన్నికలు నిర్వహించనుంది.

నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 90కి పెరిగింది. 2014లో చివరిసారిగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 2019లో ప్రత్యేక ప్రతిపత్తి హోదాను జమ్ముకు తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రప్రభుత్వం విభజించింది. నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించలేదు ఈసీ. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది.

జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రోజున బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. మిగిలిన సీట్లపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త ముఖాలను బీజేపీ బరిలోకి దింపి తమ అదృష్టాన్ని పరిక్షించుకోనుంది.

జమ్ముకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. బీజేపీ సీఈసీ సమావేశం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జమ్ముకశ్మీర్ ఎన్నికల వ్యూహం, రాష్ట్రంలో ప్రధాని ర్యాలీలపై చర్చించారు. ఎన్నికల అంశాలు, ప్రచార వ్యూహాలపై చర్చలు జరిగాయి. మరోవైపు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల సర్దుబాటు జరుగుతోంది.


Tags:    

Similar News