పెను ప్రమాదాన్ని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డ మహిళ

Update: 2021-02-18 05:32 GMT

పెను ప్రమాదాన్ని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డ మహిళ

హరియానలో ఓ మహిళ పెను ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది. రైలు వస్తు్న్నా పట్టాలు దాటడానికి ప్రయత్నించింది. ఇంతలో ఆ రైలు కాస్త మీదకు దూసుకొచ్చంది. అది గమనించిన మహిళ ఎటూ వెళ్లలేనిస్థితిలో అరచేతిలో ప్రాణాలు పట్టుకుని పట్టాలపైనే పడుకుండిపోయింది. ఇంతలో రైలు రానే వచ్చేసింది. ఆమెపై నుంచి దూసుకెళ్లింది. ఇదంత చూస్తున్నవాళ్ల ఆ మహిళ ప్రాణాలతో బతికే అవకాశమే లేదనుకున్నారు. కానీ, ఆశ్చర్యంగా రైలు వెళ్లిన వెంటనే, ఆమె పట్టాల పైనుంచి లేచి వచ్చింది. రైలు ఆమె పై నుంచి వేళ్లే సమయంలో కింద రెండు పట్టాల మధ్యనే పడుకుంది. దీంతో చిన్న గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడింది. సమయస్పూర్తితో ప్రాణాలు దక్కించుకున్న ఆ మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Tags:    

Similar News