సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి

గురునానక్ ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సిక్కుల గురువైన గురునానక్ జన్మించి నేటికి 550 సంవత్సరాలు.

Update: 2019-11-12 04:30 GMT

గురునానక్ ఈయన గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సిక్కుల గురువైన గురునానక్ జన్మించి నేటికి 550 సంవత్సరాలు. ఈయన సిక్కు గురువులలో మొదటి వారైన ఆయన జయంతి వేడుకలను సిక్కులు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.

అసలెవరీ గురునానక్...

సిక్కుమత స్థాపకుడు గురు నానక్ దేవ్ 1469లో పాకిస్తాన్ లోని నన్కానా సాహిబ్ లో ఒక హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మెహతా కలు ప్రభుత్వ శాఖలో గుమాస్తాగా పనిచేసే హిందూ పట్వారీ. నానక్ తల్లి మాతా త్రిపుర, గురునానక్ కు బీబీ నాన్కీ అనే సోదరి ఉండేది. ఈయన హిందూ, ఇస్లామియా మతాలకు సంబంధించిన గ్రంథాలను చదివినప్పటికీ సిక్కు మతాన్ని స్థాపించాడు.

ఈయన ఏకేశ్వరోపాసనను ప్రబోధించి కులవ్యవస్థను వ్యతిరేకించిన గురువు. గురు నానక్ కి తాను చిన్నతనంలో ఉన్నప్పటినుంచే ప్రశ్నించే తత్వం, దేవుని పట్ల అపార భక్తి కలిగిన వారు. ఈయన చిన్న వయసులో ఉన్నప్పటి నుంచే బీబీ నాన్కీ తన తమ్ముడిలో భగవంతుని జ్యోతి చూడగలిగేవారు. ఆమెనే గురు నానక్ దేవ్ జీకి తొలి శిష్యురాలిగా ఉన్నారు.చిన్నతనంలోనే నానక్ హిందూ మతంలోని తాత్త్వికతపై ఆకర్షితుడైన ఈయన జీవిత సత్యాలను తెలుసుకునేందుకు ఇంటిని వదలి వెళ్ళిపోయారు.

ఆ సమయంలోనే ఆయన భారతదేశంలోని తాత్త్వికులు, బోధకులు కబీర్, రవిదాస్ లను కలుసుకున్నారు. ఆ ప్రయాణం కొనసాగే సమయంలోనే నానక్ బతాలా గ్రామానికి చెందిన వ్యాపారి మూల్ చంద్ చోనా కుమార్తె సులేఖ్నీతో పెళ్లి జరిగింది. శ్రీచంద్, లక్ష్మీదాస్ అనే కుమారులు జన్మించారు.అనంతరం 28సం వయసులో ఒకరోజు పొద్దున్నే గురు నానక్ దేవ్ నదీ స్నానం చేసి ధ్యానం చేసుకుంటున్నారు. ఏమైందో తెలియదు ఆ తర్వాత మూడురోజుల పాటు ఎవరికి కనపడలేదు. మూడు రోజుల తరువాత తిరిగి వచ్చాక "దేవుని పవిత్రాత్మను నింపుకున్నాను" అని చెప్పారు.

తరువాత ఆయన హిందువూ లేడు, ముస్లిమూ లేడు అంటూ ఆయన బోధలు చేయడం ప్రారంభించారు. వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తూ భగవంతుడు పంపిన సందేశాన్ని ప్రబోధిస్తూ నాలుగు సుస్పష్టమైన ప్రధాన దిశల్లో ప్రయాణం చేశారు. గురు నానక్ తన జీవిత చివరి రోజుల్లో ఉచిత ప్రసాదం లభించే కర్తార్ పూర్ లో తన జీవనాన్ని సాగించారు. తన ఆహారాన్ని మత భేదం, కుల భేదం, ధన భేదం లాంటివి లేకుండా అందరితోనూ పంచుకునేవారు. తన చివరి రోజుల్లో కొత్త సిక్ఖు గురువుగా భాయ్ లెహ్నాను ప్రకటించారు. అనంతరం గురునానక్ 22 సెప్టెంబరు 1539లో 70వ ఏట మరణించారు. అయినప్పటికీ తాను బోధించిన బోధనలను సిక్కులు పాటిస్తూనే ఉన్నారు. శారీకంగా దూరమైనప్పటికీ మానసికంగా సిక్కుల మత గురువు ఎప్పుడూ వారితోనే ఉంటారు.   

Tags:    

Similar News