Vijay Devarakonda: హిందీలో దుమ్మురేపుతున్న డియర్ కామ్రేడ్
Vijay Devarakonda: యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్
Vijay Devarakonda: ఎవరికి ఏ సినిమా ఎలా నచ్చుతుందో ఎవరం చెప్పలేం. తమిళులకు నచ్చింది.. మనకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చింది.. మళయాళంలో అయితే అసలే వర్కవుట్ కాదు. ఇక హిందీ వాళ్లకు మనకు చాలా ఫరక్ ఉంటుంది. ఏవో కొన్ని పాన్ ఇండియా సినిమాలు అయితేనే సక్సెస్ అవుతాయి... బాహుబలిలాగా. కాని విజయ్ దేవరకొండ సినిమా డియర్ కామ్రేడ్ ఇక్కడ నీరసం తెప్పించింది. తమిళ, మళయాళం, కన్నడ అన్నిటిలోనూ అదే పరిస్ధితి. కాని హిందీలో డబ్ చేసి వదిలితే ఇరగదీసేస్తుంది. ఇప్పుడిదే అందరికీ షాకిస్తోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఎక్కడికో వెళ్లిపోయారు. టాలీవుడ్ రౌడీగా క్రేజ్ సంపాదించుకున్నారు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'డియర్ కామ్రేడ్' మూవీ ఫ్లాప్ అయింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడలో రిలీజ్ చేసినప్పటికీ సక్సెస్ కాలేదు. డియర్ కామ్రేడ్ ఘోరంగా విఫలమవడంతో విజయ్ ఫ్యాన్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఐతే.. ఈ సినిమాను హిందీలో కరణ్ జోహార్ నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. కానీ 'డియర్ కామ్రేడ్' ఫ్లాప్ కావడంతో ఆ ప్రయత్నాలు చేయలేదు. కానీ విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటతో ఇపుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండను 'లైగర్' మూవీతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు.
హీరోగా విజయ్ దేవరకొండకు తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఆ సంగతి పక్కన పెడితే.. విజయ్ దేవరకొండ హీరోగా నటించి తెలుగులో ఫ్లాపైన 'డియర్ కామ్రేడ్' మూవీ హిందీలో మాత్రం ఓ రేంజ్‌లో ఇరగదీసింది. డియర్ కామ్రేడ్ చిత్రాన్ని హిందీ ప్రేక్షుకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సినిమా స్టోరీతో పాటు విజయ్ యాక్టింగ్, విజయ్-రష్మిక రొమాన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు. జనవరి 19న యూబ్యూబ్‌లో విడుదలైన డియర్ కామ్రేడ్ హిందీ డబ్బింగ్ వర్షన్ రికార్డుల మోత మోగిస్తోంది. యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే 12 మిలియన్లు (కోటి 20 లక్షల) వ్యూస్ సాధించిది డియర్ కామ్రేడ్. అంతేకాదు ఇపుడు యేడాదిన్న వ్యవధిలో ఏకంగా 250 (25 కోట్లు) మిలియన్ వ్యూస్ రాబట్టి సంచలనం రేపింది.అంతేకాదు 2.9 లైక్స్ సంపాదించి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసింది