నవ్వి'తేన'వ్వండి

నవ్వు నాలుగు విధాల స్వీటే కాదు అన్నిరకాలుగా నూ ఆరోగ్యకారణం కూడానూ. ఎంతో ఒత్తిడితో సతమతమయ్యే మనకు నాలుగు నవ్వు తెప్పించే కబుర్లు వుంటే.. మనసు ఉల్లాసంగా ఉంటుంది.. ఏమంటారు? అందుకే మీ కోసం కొన్ని సరదా జోక్స్..

Update: 2019-09-17 04:37 GMT

నోటికి ప్లాస్టర్!

దాసు బాగా త్రాగేసి ఇంటికొచ్చాడు. మొదలే బార్య బాధితుడు కాబట్టి... అర్థరాత్రి కావడంతో కొంచెం జాగ్రత్త తీసుకుందామని... భార్యకు అనుమానం రాకుండా, వాసన తెలియకుండా...

ఓ అద్దం ముందు నిలబడి నోటికి ప్లాస్టర్‌ అతికించి వెళ్ళి పడుకున్నాడు.

పొద్దున్నే భార్య వచ్చి '' మీరు రాత్రి బాగా త్రాగొచ్చారా..? '' అనడిగింది.

'' అబ్బే.. నేనసలు త్రాగలేదు..'' అన్నాడు దాసు.

'' మరి ఈ ప్లాస్టరు ఎవరు అతికించారు..?'' కోపంగా అడిగింది అద్దానికి అతికించి ఉన్న ప్లాస్టర్‌ చూపిస్తూ!

ఇక దాసుకి గ్లాస్లన్ని దిగింది... ఆ నాటి...క్లాస్ మొదలైంది.... 

పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత!

ఎమ్మెల్యే వేంకటాద్రి కూతురు వెంకటలక్ష్మి కోసం పెళ్లి సంభంధాలు చూడటం మొదలెట్టారు....

వెంకటలక్ష్మిని ఆవిడా స్నేహితురాలు అడిగింది..

'' లక్ష్మి! నీకెన్ని సంభందాలోచ్చినా కాదంటున్నావట, అసలెలాంటివాడు కావాలనుకుంటున్నావు?''

అప్పడు లక్ష్మి అంది...

'' నాకు భర్త కాబోయేవాడు.......

పెళ్ళి కానంతవరకూ అతడొక అభ్యర్థిలాగా, నన్ను ఓటరు లాగ చుసుకోవలె. పెళ్ళయ్యాక మాత్రం గెలిచిన అభ్యర్థిలాగా నేను, ఓటేసిన ఓటరులాగా అతనూ ఉండాలి..'' అని సిగ్గుతో చెప్పింది వెంకటలక్ష్మి.

పతియే..ప్రత్యక్ష దైవం.

జానకి సుష్మిత ఒకే అపార్ట్ మెంట్ లో వుంటారు....

ఒకరోజు జానకి.... సుష్మితతో....

మా వారు వస్తే ఈ తాళం చెవి ఇవ్వండి. మధ్యాహ్నం, ఇంకా రాత్రికి కూడా కలిపి వంట చేసేయమనండి అంది..జానకి.

సరే....ఇస్తా కానీ, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెడుతున్నారు? అని అడిగింది సుష్మిత .

అప్పుడు జానకి....భర్తల్ని సరిగా చూసుకోని భార్యల గురించి ఒక సభ జరుగుతోంది అంది.

వెంబడే...సుష్మిత..ఓ ఆ ప్రసంగం వినడానికి వెడుతున్నారా? అంది.

అప్పుడు జానకి లేదండి....

పతియే..ప్రత్యక్ష దైవం అని మాట్లాడడానికి వెలుతున్నాను. ఆ సభకి నేను ముఖ్య అతిథిని అంది.

ఒక్క సారి వస్తే అంతే!

ఉడిపి హోటల్ లో పనిచేసే సీనియర్ వెయిటర్ సుబ్బారావు....కస్టమర్ టేబుల్ పై మంచి నీళ్ళ గ్లాస్ పెడుతూ...

'' మీరి హోటల్‌కి మొదటిసారిగా వచ్చారు కదా సర్?'' అని అడిగాడు.

'' అవును కాని ఆ విషయం నువ్వెలా కనిపెట్టావోయ్‌ బాబు?'' అని ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బరాజు.

'' ఎందుకంటే ఒక్కసారి యీ హోటల్‌లో తిన్నవారు చచ్చినా మరోసారి ఈ హోటల్‌కి రారు కనుక...'' అసలు విషయం చెప్పి నాలిక్కరుచుకున్నాడు వెయిటర్.


Tags:    

Similar News