Samantha: యూట్యూబర్‌లపై లీగల్ యాక్షన్ తీసుకోనున్న సమంత

Samantha: వారికి వ్యతిరేకంగా కేసు పెట్టిన సమంత

Update: 2022-09-06 16:00 GMT

Samantha: యూట్యూబర్‌లపై లీగల్ యాక్షన్ తీసుకోనున్న సమంత

Samantha: గత కొంతకాలంగా స్టార్ బ్యూటీ సమంత పేరు తన సినిమాల వల్ల కాకుండా వ్యక్తిగత విషయాల వల్ల మాత్రమే వార్తల్లో వినిపిస్తూ వస్తోంది. తాజాగా కూడా మళ్లీ తన వ్యక్తిగత విషయం వల్ల సమంత మళ్ళీ వార్తల్లో నిలిచింది. అయితే గత రెండు నెలలుగా సమంత సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తుంది. అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇటు ట్విట్టర్లో కానీ ఆమె అకౌంట్ నుంచి చాలా తక్కువ పోస్టులు మాత్రమే రావటం గమనార్హం. ఈ నేపథ్యంలో సమంత గురించి బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. ఇక మరికొన్ని యూట్యూబ్ చానల్స్ వారైతే తమ లిమిట్ ని కూడా దాటి మరి ఆమెపై కామెంట్లు చేస్తున్నారు.

గత కొంతకాలంగా సమంత ఆరోగ్యం ఏ మాత్రం బాగుండటం లేదని అందుకే ఆమె సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను అని కొందరు షాకింగ్ పుకార్లను సృష్టించారు. దీనికి సంబంధించి సమంత మీద థంబ్ నెయిల్స్ కూడా సృష్టించారు. ఇవన్నీ చూసి బాగా హర్ట్ అయిన సమంత ఇప్పుడు వారికి వ్యతిరేకంగా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమైంది. తన గురించి తప్పుడు పుకార్లను సృష్టిస్తున్న యూట్యూబర్‌లపై సమంత కేసు నమోదు చేసింది అంటూ ఆమె మేనేజర్ స్వయంగా ప్రకటించారు. గతంలో కూడా నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంతా పై బోలెడు నెగిటివ్ రూమర్లు బయటకు వచ్చాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ తనపై వస్తున్న వార్తలు చూసి సమంత హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించింది.

Tags:    

Similar News