Triptii Dimri: ఏడ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి.. ఎమోషనల్‌ అయిన యానిమల్‌ బ్యూటీ

Update: 2025-01-05 10:15 GMT

Triptii Dimri interesting comments about Animal movie: సందీప్‌ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఓవైపు యాక్షన్‌, రొమాన్స్‌ ఎక్కువైందని విమర్శలు ఎదుర్కొన్నా కలెక్షన్లపరంగా మాత్రం సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాలో రష్మికతో పాటు త్రిప్తి డిమ్రి నటించిన విషయం తెలిసిందే.

కనిపించింది కొద్దిసేపే అయినా తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఈ సినిమాలో గ్లామర్‌ పాత్రలో నటించి, దేశం మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.

యానిమల్‌ మూవీకి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా మహిళలకు వ్యతిరేక చిత్రంగా తానెప్పుడు చూడలేదని చెప్పుకొచ్చిన త్రిప్తి.. సినిమాలకు అలాంటి ట్యాగ్స్‌ ఇవ్వనని తేల్చి చెప్పించింది. ‘కోలా’, ‘బుల్బుల్’ చిత్రాలు చేస్తున్నప్పుడు వాటిని స్త్రీవాద చిత్రాలుగా భావించలేదు. ఆయా కథల్లోని పాత్రకు కనెక్ట్‌ అయి.. దర్శకులపై నమ్మకం ఉంచి వాటిని ఎంచుకుంటాని తెలిపింది.

ఇక యామిమల్ చిత్రంలో అవకాశం వచ్చిన వెంటనే దర్శకుడు సందీప్‌ వంగాను కలిసినట్లు తెలిపిన త్రిప్తి.. దర్శకుడు తనకు కథ గురించి అస్సలు చెప్పలేదని, కేవలం జోయా పాత్ర గురించే వివరించారన్నారు. అప్పటి వరకు తాను కేవలం సాఫ్ట్‌ పాత్రల్లో నటించానని కానీ యానిమల్‌ల అందుకు పూర్తి భిన్నమైన పాత్రను పోషించినట్లు తెలిపింది. 'మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ.. దయ, సానుభూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు. అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పాను' అని చెప్పుకొచ్చింది. 

Tags:    

Similar News