RRR Sequel: ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్‌ వస్తుందా? ఈ వార్తలో నిజమెంత?

Update: 2025-01-05 07:46 GMT

RRR Sequel on cards?: రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా తెరకెక్కిన ట్రిపులార్‌ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఒక్క భారత్‌లోనే కాకుండా ప్రపంచంలో విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఏకంగా రూ. 1800 కోట్ల వరకు రాబట్టింది.

ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రిపులార్‌ మూవీ పేరు మారుమోగింది. రాజమౌళి అద్భుత దర్శకత్వం.. ఎన్టీఆర్‌, చెర్రీల నటన ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ట్రిపులార్‌ చిత్రానికి సీక్వెల్‌ వస్తుందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. నిజానికి ట్రిపులార్‌ కథ ఎండింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంది. అసలు రెండో పార్ట్ రావడానికి అవకాశాలే లేవు.

కానీ ఆ మధ్య ట్రిపులార్‌ సీక్వెల్‌పై రచయిత విజయేంద్ర ప్రసాద్‌ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సీక్వెల్‌కు కథ సిద్ధంగా ఉందని రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దీనిపై రాజమౌళి స్పందించకపోవడంతో ఈ వార్త అలాగే మిగిలిపోయింది. ఇదిలా ఉంటే తాజాగా విడుదలైన ట్రిపులార్‌ డాక్యుమెంటరీ నేపథ్యంలో మరోసారి ట్రిపులార్‌ సీక్వెల్‌కు సంబంధించి వార్తలు తెరపైకొస్తున్నాయి. డాక్యుమెంటరీకి వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్‌ మళ్లీ సీక్వెల్‌పై దృష్టిసారిస్తున్నట్లు సమాచారం.

రాజమౌళి కూడా ట్రిపులార్‌కు పార్ట్‌ 2 చేస్తే బాగుంటుందనే ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా బాహుబలి 3కి సంబంధించి కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కూడా జక్కన్న స్పందించలేదు. రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఎంత కాదన్న మూడేళ్ల సమయం పట్టడం ఖాయం. అలాగే రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు సైతం తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రిపులార్‌ సీక్వెల్‌ రావాలంటే కనీసం 4 ఏళ్లు అయినా ఆగాల్సిందే. ఈ లెక్కన ఏ 2030లోనో దీనికి సంబంధించి వార్త వినే అవకాశాలు ఉన్నాయన్నమాట. 

Tags:    

Similar News