Ram Charan Daughter: రామ్ చరణ్ బిడ్డది చరిత్ర సృష్టించే జాతకం.. రెండో సంతానం ఉండదంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్..!

Ram Charan Daughter: రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు.

Update: 2023-06-20 13:14 GMT

Ram Charan Daughter: రామ్ చరణ్ బిడ్డది చరిత్ర సృష్టించే జాతకం.. రెండో సంతానం ఉండదంటూ వేణుస్వామి షాకింగ్ కామెంట్స్..!

Ram Charan Daughter: రామ్ చరణ్ ఉపాసన తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. దీంతో అటు మెగా కుటుంబంలోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ అంబరాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఉపాసనకు శుభగడియల్లో పాప పుట్టిందంటూ చెప్పుకొచ్చారు. మంగళవారం ఉదయం 1.46 గంటలకు ఉపాసనకు పాప పుట్టిన సంగతి తెలిసిందే. మా అందరికీ ఇష్టమైన మంగళవారం నాడే మా మనువరాలు జన్మించడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. కాగా, కొన్ని రోజులుగా మెగా ఇంట అన్ని శుభకార్యాలు జరగడం చాలా సంతోషంగా ఉందని, వరుణ్ తేజ ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే, ఇవాళ ఆడబిడ్డ మెగా ఇంట్లో అడుగుపెట్టడం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు.

అయితే, ఈ క్రమంలో పాప జాతకంపై పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పాప జాతకాన్ని విశ్లేషిస్తూ.. రాంచరణ్, ఉపాసనల పాప పునర్వసు నక్షత్రం రెండవ పాదం, మిధున రాశిలో జన్మించిందని, అలాగే జన్మ నామం కోనంగి అని చెప్పుకొచ్చారు. రాంచరణ్ రాశి రోహిణి, ఉపాసన రాశి క్రుతిక, నేడు జన్మించిన పాప ది పునర్వసు నక్షత్రం అని, ఈ ముగ్గురి నక్షత్రాలు దేవాత అంశ కలిగినవి అని చెప్పుకొచ్చారు. దీని వల్ల మెగా కుటుంబంలో రాజయోగం కనిపిస్తుందని, చిరంజీవి ఇంట్లో శుభ ఘడియలకు కొదువే లేదని అన్నారు.

మెగా ప్రిన్సెస్ జాతకంలో రాజయోగం ఉట్టిపడుతోందని అన్నారు. అచ్చం చిరంజీవి జాతకంలో ఉన్నటు వంటి గురుచెండాలయోగమే.. పాప జాతకంలోనూ ఉందని, అంటే చిరంజీవిలాగే పాప కూడా చరిత్ర సృష్టించే జాతకం అని ఆయన అన్నారు. చిరంజీవితోపాటు, రాంచరణ్, ఉపాసనల కంటే ఎక్కువ పేరు సాధింస్తుందని చెప్పుకొచ్చారు. అయితే, పాప జాతకంలో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. పంటి, చెవులు, నరాలకు సంబంధించిన చిన్నచిన్న సమస్యలు వస్తాయని అన్నారు. అయితే, గురుచెండాల యోగం వల్ల రాంచరణ్, ఉపాసనలకు తదుపరి సంతానం ఉండకపోవచ్చని షాక్ ఇచ్చారు. ఈ జాతకంలో కేవలం సింగిల్ చైల్డ్‌గా ఉందని అన్నారు. అలాగే, రాంచరణ్ జాతకంలో ఇక మగ సంతానం ఉండకపోవచ్చంటూ బాంబ్ పేల్చారు.

Full View


Tags:    

Similar News