Game Changer Trailer: రికార్డులను చెరిపేసిన గేమ్ ఛేంజర్ ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే..
Ram Charan Game Changer movie trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. పుష్ప2, దేవర సినిమాల ట్రైలర్ల రికార్డులను గేమ్ చేంజర్ చెరిపేసింది.
Ram Charan Game Changer movie trailer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ విడుదలైన 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 180 ఫ్లస్ మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ సరికొత్త పోస్టర్ ద్వారా తెలియజేసింది. ఇందులో గుర్రం కంటే వేగంగా రామ్ చరణ్ పరిగెడుతున్నట్టుగా ఉంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి.
యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ ఇంకా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. పుష్ప2, దేవర సినిమాల ట్రైలర్ల రికార్డులను గేమ్ చేంజర్ చెరిపేసింది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న గేమ్ చేంజర్ పూర్తవడానికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ నటించారు. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానులు, సినీ ప్రియులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
సంక్రాంతి కానుకగా ఈ నెల 10న గేమ్ చేంజర్ దేశవ్యాప్తంగా విడుదలకానుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో గేమ్ ఛేంజర్ మూవీని విడుదల చేయనున్నట్టు సినిమా మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో తాజాగా గేమ్ ఛేంజర్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇటీవల రిలీజైన సినిమాల ట్రైలర్ రికార్డులను గేమ్ ఛేంజర్ ట్రైలర్ చెరిపేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ మేకర్స్ విడుదల చేసిన చెర్రీ ఫొటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.
ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు తమిళం, హిందీలో వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే.. ఓపెనింగ్స్ కూడా అందే రేంజ్‌లో ఉండేలా కనిపిస్తోంది. ఇక ఇవాళ తూర్పుగోదావరిలో జరిగే గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆ తర్వాత చెన్నైలో జరిగే ఈవెంట్‌లతో ప్రమోషన్స్ పీక్స్‌కు చేరేలా ఉంది. ఇప్పటికే హిందీ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్‌తో కలిసి రామ్ చరణ్, కియారా సందడి చేశారని టాక్. చూస్తుంటే ఈ వారం అంతా గేమ్ ఛేంజర్ మేనియానే కనిపించేలా ఉంది. మరి గేమ్ ఛేంజర్ భవిత్యం ఏంటో తెలియాలంటే జనవరి 10 వరకు వెయిట్ చేయాల్సిందే.