Tollywood 2025: ఈ ఏడాది దుమ్మురేపడానికి సిద్ధమవుతోన్న బడా సినిమాలు.. ప్రేక్షకులకు పండగే

Update: 2025-01-05 05:30 GMT

List of big movies going to release in 2025: 2024 ఏడాది గడిచిపోయింది. కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టేశాం. 2024 టాలీవుడ్‌కి భారీగా కలిసొచ్చిందని చెప్పాలి. పుష్ప2, కల్కి వంటి భారీ విజయాలతో పాటు చిన్న చిన్న సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. ఇదిలా ఉంటే 2025లో ఇండస్ట్రీని ఏలేందుకు కొన్ని బడా చిత్రాలు వస్తున్నాయి. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీపై దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతోన్న అలాంటి మూవీస్‌‌పై ఓ లుక్కేయండి..

* ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్న తొలి బడా మూవీ గేమ్‌ ఛేంజర్‌. రామ్‌ చరణ్‌ హీరోగా, శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 10వ తేదీన దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే.

* ఇక ఈ ఏడాది పవన్‌ కళ్యాణ్‌ కూడా ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు సిద్దమవుతున్నారు. మార్చ్ 28న హరిహర వీరమల్లు విడుదల చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. అదే విధంగా ఓజీ కూడా ఇదే ఏడాది చివరిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

* ప్రభాస్‌ ఈ ఏడాది కూడా జైత్రయాత్రను కొనసాగించనున్నారు. సమ్మర్‌ కానుకగా రాజా సాబ్ విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.

* ఇక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీ సైతం 2025 చివరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

* ఈ ఏడాది అందరి దృష్టి ఉన్న మరో సినిమా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తోంది. నిజానికి సంక్రాంతికే రావాల్సి ఉండగా గేమ్‌ ఛేంజర్‌ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.

* నట సింహం బాలకృష్ణ సంక్రాంతికి డాకూ మహరాజ్‌ మూవీతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఈ ఏడాదిలోనే అఖండ 2 మూవీతో కూడా ప్రేక్షకులను పలకరించనున్నారు.

* ఈ ఏడాది వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ వార్‌ 2. హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

* ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న మరో మూవీ హిట్‌. మే1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

Tags:    

Similar News