కాంచన 3 మూవీ రివ్యూ

Update: 2019-04-19 10:02 GMT

చిత్రం: కాంచన 3

నటీనటులు: రాఘవ లారెన్స్, ఓవియ, వేదిక, కోవై సరళ, దేవదర్శిని, శ్రీమాన్, మనోబాల, కబీర్ దుహన్ సింగ్ తదితరులు

సంగీతం: డూపాడూ

ఛాయాగ్రహణం: వెట్రి సుశీల్ చౌదరి

ఎడిటింగ్‌: రూబెన్

నిర్మాతలు: కళానిధి మారన్, రాఘవ లారెన్స్

దర్శకత్వం: రాఘవ లారెన్స్

బ్యానర్: సన్ పిక్చర్స్, రాఘవ ప్రొడక్షన్స్

విడుదల తేదీ: 19/04/2019

హారర్ కామెడీ చిత్రాలంటే తెలుగు తమిళ ప్రేక్షకులకు గుర్తొచ్చే కొన్ని సినిమాలలో 'కాంచన 3' కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 'ముని', 'కాంచన', 'కాంచన 2 (గంగ)' అనే సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు 'ముని' సిరీస్ లో నాలుగవ భాగం, అలాగే 'కాంచన' సిరీస్ లో మూడవ భాగమైన 'కాంచన 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటిలాగానే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడమే కాక ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు రాఘవ లారెన్స్. ఓవియ, వేదిక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ముందు సినిమాలో లాగానే కోవై, సరళ, శ్రీమాన్, దేవదర్శిని ఈ సినిమాలో కూడా కనిపించనున్నారు. రాఘవ లారెన్స్, కళానిధి మారన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇవాళ అనగా ఏప్రిల్ 19, 2019 న విడుదలైంది. మరి ప్రేక్వెల్స్ లాగానే 'కాంచనా 3' కూడా ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూసేద్దామా..

కథ:

'కాంచన 3' కథ లో కూడా మిగతా 'కాంచన' సినిమాలలో కనిపించిన పాత్రలే ఎక్కువ కనిపిస్తాయి. రాఘవ (రాఘవ లారెన్స్) కి దెయ్యాలంటే చాలా భయం. కానీ ఒకరోజు రాఘవ కి దెయ్యం పడుతుంది. ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు చూసి రాఘవ వాళ్ళ అమ్మ(కోవై సరళ), అన్నయ్య (శ్రీమాన్), వదిన (దేవదర్శిని) ఇంట్లో దెయ్యాలున్నాయి అని తెలుసుకుంటారు. అసలు రాఘవ ఒంట్లోకి వచ్చిన దెయ్యం ఎవరు? ఎందుకు రాఘవ ఒంట్లోకి ప్రవేశించింది? చివరికి ఏమైంది అని తెలియాలంటే సినిమా వెండితెరపై చూడాల్సిందే.

నటీనటులు:

రాఘవ లారెన్స్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రాఘవ లారెన్స్ అద్భుతమైన నటనను కనబరిచారు. అంతకుముందు సినిమాలలో లాగానే ఈ సినిమాలో కూడా లారెన్స్ నటన హైలైట్ గా మారుతుంది. ఓవియ, వేదిక, నిక్కీ తంబోలి ముగ్గురు హీరోయిన్లు ఉండటంతో, గ్లామరస్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది. ముగ్గురూ వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని పాత్రలలో ముగ్గురు హీరోయిన్ లు వారి పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. కోవై సరళ తన పాత్రకు మళ్లీ న్యాయం చేశారు. శ్రీమాన్, దేవదర్శిని కూడా చాలా బాగా నటించారు. కబీర్ సింగ్ జోహాన్ నటన చాలా ఎనర్జిటిక్ గా ఉంది. మిగతా నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించారు.

సాంకేతిక వర్గం :

రాఘవ లారెన్స్ ఈ సినిమాలో అద్భుతంగా నటించడమే కాక దర్శకత్వంపై కూడా అంతే దృష్టి పెట్టారు. కథను చాలా బాగా నెరేట్ చేశారు. ఇంతకుముందు కాంచన సినిమాల లాగానే ఈ సినిమాలో కూడా కామెడీని దట్టించి, కొంచం హారర్ టచ్ ఇచ్చి అంతే ఎమోషనల్ కంటెంట్ ని కూడా యాడ్ చేశారు. కథను బాగా హ్యాండిల్ చేశారు రాఘవ లారెన్స్. ఈ సినిమాకు కళానిధి మారన్ మరియు రాఘవ లారెన్స్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఏ మాత్రం రాజీపడకుండా చక్కని క్వాలిటీ అవుట్ పుట్ ని అందించారు. డూపాడూ అందించిన సంగీతం సినిమాలో చాలా బాగుంది. పాటలు పక్కన పెడితే నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ గా మారింది. వెట్రి సుశీల్ చౌదరి అందించిన విజువల్స్ ఈ సినిమాకు చాలా బాగా కుదిరాయి. హారర్ సన్నివేశాల్లో కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. రూబెన్స్ ఎడిటింగ్ పర్వాలేదనిపించింది.

బలాలు:

రాఘవ లారెన్స్ నటన

నేపధ్య సంగీతం

కామెడీ

బలహీనతలు:

రొటీన్ సన్నివేశాలు

మాస్ కంటెంట్ ఎక్కువ అవ్వడం

చివరి మాట:

మిగతా 'కాంచన' సినిమాలతో పోలిస్తే 'కాంచన 3' సినిమాలో కూడా అవే సీన్లు రిపీట్ అయినట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ సీన్లు బాగానే పండినప్పటికీ ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. మొదటి హాఫ్ మొత్తం కామెడీ మరియు కొంచెం హారర్ తో నిండి ఉంటుంది. ఈ సినిమాలో ఇంటర్వెల్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇక మొదటి హాఫ్ తో కంపేర్ చేస్తే రెండవ హాఫ్ కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. ఇంతకుముందు 'కాంచన' సిరీస్ సినిమాలలో హిట్ అయిన పాయింట్లు ఈ సినిమాలో కూడా మళ్లీ రిపీట్ చేశారు. ఎప్పటిలాగానే 'కాంచన 3' సినిమా క్లైమాక్స్ 'కాంచన 4' త్వరలో వస్తుంది అన్నట్టుగా ఉంటుంది.

బాటమ్ లైన్:

'ముని', 'కాంచన', 'గంగ' లను కలగలిపిన 'కాంచన 3'. 

Similar News