Maa Nanna Superhero Review: ఒక కొడుకు ఇద్దరు తండ్రుల ఎమోషనల్ జర్నీ..!

Maa Nanna Superhero Review: మా నాన్న సూపర్ హీరో మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2024-10-11 05:37 GMT

Maa Nanna Superhero Review

Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు ఇటీవల యాక్షన్‌ చిత్రాలతోనే ఎక్కువగా ప్రేక్షకులను పలకరించాడు. అయితే చాలా రోజుల తర్వాత ఓ ఎమోషనల్‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే మా నాన్న సూపర్ హీరో. దసరా కానుగా అక్టోబర్‌ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సరికొత్త పంథాలో వచ్చిన సుధీర్‌ బాబు ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకున్నాడు. మా నాన్న సూపర్ హీరో మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంతకీ కథేంటంటే..

జానీ (సుధీర్‌బాబు) పుట్టగానే తల్లిని కోల్పోతాడు. అయితే కన్నతండ్రి ప్రకాశ్‌ (సాయిచంద్‌) చేయ‌ని త‌ప్పునకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో జానీ అనాథాశ్రమంలో పెరుగుతాడు. ఆ త‌ర్వాత అత‌న్ని శ్రీనివాస్‌ (సాయాజీ షిండే) ద‌త్త‌త తీసుకుని పెంచుతాడు. అయితే మొదట్లో సొంతకొడుకులా ప్రేమగా చూసుకున్నా.. దత్తత తీసుకున్న కొన్ని రోజులకే భార్య (ఆమ‌ని)ను కోల్పోవ‌డం, స్టాక్ మార్కెట్‌లో దెబ్బ‌తిని ఆర్థికంగా చితికిపోవడంతో జానీని ఇంటికి తెచ్చుకోవ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని భావించి.. ద్వేషం పెంచుకుంటాడు.

కానీ జానీ మాత్రం శ్రీనివాస్‌ను సొంత తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటాడు. స్టాక్‌మార్కెట్‌లో భారీ లాభాలొస్తాయ‌ని చెప్పి ఊళ్లోని ఓ నాయ‌కుడితో శ్రీనివాస్ భారీ మొత్తంలో షేర్ల‌లో పెట్టుబడులు పెట్టిస్తాడు. అందులో తీవ్ర న‌ష్టాలు రావ‌డంతో ఆ నాయ‌కుడు శ్రీనివాస్‌ను జైల్లో పెట్టించి హింసించ‌డం మొద‌లు పెడ‌తాడు. దీంతో తండ్రిని ర‌క్షించుకునేందుకు ఆ అప్పు బాధ్య‌త‌ను త‌న భుజానికెత్తుకుంటాడు. ఇందుకోసం కోటి రూపాయ‌లు కావాల్సి వ‌స్తుంది. మ‌రోవైపు 20ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి విడుద‌లైన ప్ర‌కాశ్ త‌న బిడ్డ‌ను వెతుక్కుంటూ ప్ర‌యాణం ప్రారంభిస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? జానీ త‌న తండ్రిని కాపాడుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేశాడు? ఈ క్ర‌మంలో ప్ర‌కాశ్‌తో క‌లిసి ఎందుకు ప్ర‌యాణం చేయాల్సి వ‌చ్చింది? జానీనే త‌న కొడుక‌ని ప్ర‌కాశ్‌కు ఎలా తెలిసింది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

ఒక కొడుకు, ఇద్దరు తండ్రుల మధ్య జరిగే ఎమోషనల్‌ జర్నీగా ఈ సినిమాను తెరకెక్కించారు. కథలో దర్శకుడు కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. జానీ, శ్రీనివాస్‌ల మధ్య జరిగే ఎమోషనల్‌ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తండ్రి, కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలను దర్శకుడు సరికొత్తగా డిజైన్‌ చేశాడు. తండ్రిని కాపాడుకునేందుకు రూ. కోటి అవసరం రావడం, అది కూడా 20 రోజుల్లోనే సర్దుబాటు చేయాల్సి రావడం కథను రసవత్తరంగా మార్చింది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌ ఆకట్టుకుంటాయి.

నటీనటుల విషయానికొస్తే..

జానీ పాత్రలో సుధీర్‌ బాబు ఆకట్టుకున్నారు. ఈతరం యువతకు ఈ క్యారెక్టర్ నచ్చుతుంది. నాన్న‌ను హీరోలా భావించే కుర్రాడిగా.. అత‌ని ప్రేమ‌ను ద‌క్కించుకునేందుకు త‌ప‌న ప‌డే బిడ్డ‌గా నటించిన తీరు బాగుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో సుధీర్‌ బాబు నటన ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక ఓవర్‌ఆల్‌గా ద‌ర్శ‌కుడు అభిలాష్ రెడ్డి తీసుకున్న కథ కొత్తదనంతో నిండి ఉందని చెప్పడంలో సందేహం లేదు.

రేటింగ్‌: 2.75/5

Full View


Tags:    

Similar News