Kanguva Movie Review: 'కంగువా' రివ్యూ.. థాట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది..

Kanguva Review in Telugu: చాలా కాలంగా తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జ్ఞానవెల్ రాజా నిర్మించారు.

Update: 2024-11-14 08:27 GMT

Kanguva Movie Review

Kanguva Movie Review: చాలా కాలంగా తమిళ ప్రేక్షకులు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో జ్ఞానవెల్ రాజా నిర్మించారు. ట్రైలర్, టీజర్ కట్స్ చూసిన తర్వాత ఈ సినిమా ఏదో భిన్నంగా ఉందే అని అందరిలోనూ కాస్త ఆసక్తి ఏర్పడింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో కామన్ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం ఆసక్తికరంగా ఎదురు చూశారు. మరి ఆ ఎదురుచూపులు ఫలించి ఈ సినిమా ఎట్టకేలకు ధియేటర్లలోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ:

ఇండియన్ బోర్డర్లో రష్యా టీం రహస్యంగా ప్రయోగాలు చేస్తున్న ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే కోడ్ నేమ్ గల ఒక బాలుడు తప్పించుకుంటాడు. అతను గోవాలో ఉన్న ఫ్రాన్సిస్(సూర్య)ను వెతుక్కుంటూ వెళ్తాడు. అయితే అతని వెంట రష్యా ప్రయోగశాల టీం అంతా పడుతుంది. అయితే వచ్చిన కొద్దిసేపటికి వీరిద్దరిదీ ఈ జన్మ సంబంధం కాదని ఎన్నో జన్మల బంధం అని అర్థమవుతుంది. గత జన్మలో కంగువా( సూర్య) మీద హత్యా యత్నం చేసిన ఒక తెగ నాయకుడు కుమారుడు పులోమా మళ్ళీ జీటాగా పుట్టిన విషయం అర్థమవుతుంది.

అయితే అసలు కంగువా మీద పులోమా హత్యాయత్నం ఎందుకు చేశాడు? పంచ దీవుల సమూహంలో కంగువా ఒక తెగకు నాయకుడు అయితే మిగతా నాలుగు తెగల నాయకులెవరు? ఆ తెగలన్నీ రెండుగా విడిపోయి ఎందుకు యుద్ధానికి సిద్ధమయ్యాయి? కంగువా సహా పిల్లాడు మరో జన్మ ఎందుకు ఎత్తారు? ఒక జన్మలో వారిద్దరి మధ్య ఏం జరిగింది? ఇప్పుడు మరో జన్మలో ఏం జరిగింది? ఇలాంటి విషయాలను తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమాని కథగా చూసుకుంటే కొత్త కథ అని చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే మన తెలుగు సహా అనేక భాషల్లో పునర్జన్మల నేపద్యంలో అనేక సినిమాలు వచ్చాయి. ఒకరకంగా ఇది కూడా అలాంటి పునర్జన్మల నేపథ్యం ఉన్న కథే. అది కాక బాహుబలి లాంటి సినిమా వచ్చిన తర్వాత మిగతా భాషల దర్శక నిర్మాతలు అలాంటి ఒక విజువల్ వండర్ ను ముందుకు తీసుకువచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లు అనిపిస్తుంది. సినిమా ప్రారంభం కావడంలోనే 1070 ల కాలం చూపిస్తూ ఆ తర్వాత ప్రస్తుత కాలంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెబుతూ ఒక ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు.

అయితే కథగా బాగానే ఉన్నా దానిని తెర మీదకు తీసుకువచ్చే విషయంలో శివ అనుభవం కనిపించలేదు. ఎందుకంటే పాయింట్ చాలా బాగుంది కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విషయంలో మాత్రం చాలా తడబాట్లు కనిపించాయి. ఫస్ట్ ఆఫ్ మొత్తం పెద్దగా ఇంట్రెస్ట్ కలగకుండానే కథ నడిచిపోతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. అది కూడా కొన్ని సీక్వెన్స్లు మాత్రం బాగా పేలాయి. ఆ సీక్వెన్స్ లు అన్నింటిలో సీక్వెన్స్ లో కంటే భరించాల్సిన సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ పార్ట్ కోసం ఎక్కువగా కథ చెప్పకుండానే దాచేసారు. సెకండ్ పార్ట్ కి వదిలిన లీడ్ ఆకట్టుకునేలా ఉంది.

నటీనటుల విషయానికి వస్తే సూర్య రెండు భిన్నమైన పాత్రలలో నటించాడు. అందులో భారత యుద్ధ వీరుడు అయిన కాంగువా పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడు. ఒక రకంగా ఆ పాత్రలో రెచ్చిపోయి నటించాడు. ముఖ్యంగా కొన్ని సీన్స్ లో అయితే కళ్ళతోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ దాదాపు సఫలమయ్యాడు. అయితే ఫ్రాన్సిస్ అనే పాత్రలో మాత్రం సూర్య నటన ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.

అయితే అసలు దిశా పటానీని ఎందుకు తీసుకున్నారో? ఆమెకే తెలియాలి. యోగిబాబు, కోవై సరళ సహా చాలా మంది నటులు ఉన్నా ఎవరినీ పెద్దగా గుర్తుపెట్టుకునేలా వారి పాత్రలు లేవు. బాబీ డియోల్ పాత్ర భయంకరంగానే ఉన్నా ఆయన పాత్ర డిజైన్, నటన విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. టెక్నికల్ టీం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ముఖ్యంగా సినిమా టెక్నికల్ టీం మొత్తం మీద 100 మార్కులు ఈ కేటగిరీకి ఇవ్వొచ్చు. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఎడిటింగ్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. కాకపోతే తమిళ ఫ్లేవర్ ఎక్కువ అయినట్టు సినిమా మొత్తం అనిపిస్తుంది.

హెచ్ఎం టీవీ వర్డిక్ట్: కంగువా థాట్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ దెబ్బేసింది..

రేటింగ్‌: 2.5/5

Full View


Tags:    

Similar News