Pushpa 2 Song Dance: సూసేటి అగ్గిరవ్వమాదిరే సాంగ్‌కు శ్రేష్టి వర్మ అదిరిపోయే స్టెప్పులు.

Update: 2025-01-04 13:22 GMT

Female Choreographer Shresti Verma dance on Pushpa 2 song: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా అల్లు అర్జున్, రష్మిక మందన్న కెరియర్‌లోనే ది బిగ్గెస్ట్ హిట్‌ మూవీగా పేరు తెచ్చుకుంది. మరోవైపు ఈ సినిమా రోజు రోజుకు కొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక సూసేటి అగ్గి రవ్వ మాదిరి అనే పాట ఈ మూవీకి హైలెట్‌గా నిల్చిన విషయం తెలిసిందే. ఈ పాటకు అల్లు అర్జున్, రష్మిక మందన్న అదిరిపోయే విధంగా స్టెప్పులు వేశారు. ముఖ్యంగా ఈ సాంగ్‌లోని హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి.

ఇక సినిమా విడుదలయ్యాక ఈ పాటకు ఆదరణ మరింత పెరిగింది. ఎక్కడ చూసిన ఈ పాటకు డ్యాన్స్‌లు చేస్తూ చాలా మంది హల్‌చల్ చేశారు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కంపోజ్ చేయగా.. శ్రష్టి వర్మ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. దాని రిహార్సల్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

వీడియోలో శ్రష్టి వర్మ పలికించిన హావ భావాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం శ్రష్టి వర్మ టాలెంట్ కు ఫిదా అవుతున్నారంట. సాంగ్‌లో రష్మిక కంటే శ్రష్టి వర్మనే బాగా పర్‌ఫామ్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక శ్రష్టి వర్మ విషయానికొస్తే.. ఢీ జోడి అనే డ్యాన్స్ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి డ్యాన్సర్‌గా తన టాలెంట్‌ను ఫ్రూవ్ చేసుకున్నారు. ఆ తర్వాత శేఖర్, జానీ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశారు. ప్రస్తుతం కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

Tags:    

Similar News