Prabhas Anushka: త్వరలోనే ప్రభాస్-అనుష్క పెళ్లి..నిశ్చితార్థం ఫొటోలు ఇవిగో

Update: 2024-12-15 12:35 GMT

Prabhas Anushka Shetty Engagement: గత కొన్ని సంవత్సరాలు ప్రభాస్, అనుష్కలు పెళ్లి చేసుకోబోతన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉణ్నాయి. అంతేకాదు మీడియా కూడా వీరిద్దరికీ ఎన్నిసార్లు పెళ్లి చేసిందో చెప్పడం కూడా కష్టమే. ఇక ప్రభాస్, అనుష్క వీళ్లిద్దరూ 40ఏళ్లు పైడే ఉన్నారు. అయితే వీళ్లిద్దరి కంటే వయస్సు తక్కువగా ఉన్న హీరోహీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఎవరి జీవితాల్లో వారు స్థిరపడిపోయారు. కానీ వీళ్లిద్దరూ మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ లైఫ్ లోనే ఉన్నారు.

అంతేకాదు తెరపై ఎంతో క్యూట్ గా కనిపించే వీరి జంట నిజ జీవితంలో మంచి స్నేహితులు. అయితే వీరిద్దరు కలిసి పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటూ చూడాలనుకునే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అయితే కొన్ని మీడియా కథనాల ప్రకారం వీరిద్దరూ కొన్నేళ్లుగా సైలెంట్ గా డేటింగ్ చేస్తున్నారని చెబుతున్నాయి. అంతేకాదు వీరిద్దరి అభిప్రాయాలు కూడా కలిసాయని.. వీరు పెళ్లి చేసుకోవడమే ఆలస్యమని రాసుకొస్తున్నాయి. ఇప్పటికే వాళ్లింట్లో పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు.




 అయితే ప్రభాస్, అనుష్కలకు ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఏఐ ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నిజజీవితంలో కూడా వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ ఏఐ టెక్నాలజీతో ఫొటో తీసి వారిద్దరికీ నిశ్చితార్థం చేసేశారు. అప్పట్లో ప్రభాస్, అనుష్కలకు పెళ్లి జరిగినట్లు పిల్లలు కూడా ఉన్నట్లు ఏఐ తో ఫొటోలు చిత్రీకరించారు. మొత్తానికి ఏఐ తో ఫొటో చూసుకుని అభిమానులు సంబురపడుతున్నారు. 

Tags:    

Similar News