Raj Kapoor: బాత్రూమ్లో ఏడ్చాడు.. సిగరెట్‌తో కాల్చుకున్నాడు.. ఆ హీరో హీరోయిన్ల ప్రేమకథ తెలిస్తే.. కన్నీళ్లు ఆపుకోలేరు
Raj Kapoor: అలనాటి నటుడు రాజ్ కపూర్ ఒకప్పుడు బాలీవుడ్ లో మంచి నటుడు. డిసెంబర్ 14 ఆయన 100వ జయంతి. ఈ సందర్బంగా రాజ్ కపూర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా రాజ్ కపూర్, నర్గీస్ దత్ ల ప్రేమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజ్ కపూర్-నర్గీస్ దత్..వీరి ప్రేమాయణం గురించి అప్పట్లో కథకథలుగా చెప్పుకునేవారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. వీరికి ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఉండేది. కానీ అప్పటికే రాజ్ కపూర్ కు వివాహం జరిగింది. పిల్లలు కూడా ఉన్నారు. దీంతో వారి ప్రేమ కాస్త బ్రేకప్ అయ్యింది. తర్వాత నర్గీస్ సునీల్ దత్ అనే హీరోను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత రాజ్ కపూర్ తో కలిసి నర్గీస్ ఒక్క సినిమా కూడా చేయలేదు. వాళ్లు ఏర్పాటు చేసిన ఫంక్షన్లకు కూడా నర్గీస్ వెళ్లలేది కాదు. అలా 24 సంవత్సరాలు గడిచిపోయాయి.
నర్గీస్, రాజ్ కపూర్ కలిసి నటించిన సినిమాల్లోని పాటలు ఇప్పటికే ట్రెండింగ్ లోనే ఉంటాయి. 1958లో నర్గీస్ సునీల్ దత్ ను వివాహం చేసుకున్న తర్వాత రాజ్ కపూర్ తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. రాజ్ కపూర్ కుటుంబం గురించి మధు జైన్ రాసిన ది కపూర్స్. ది ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ సినిమా అనే పుస్తకంలో రాజ్ కపూర్ ను నర్గీస్ మోసం చేసినట్లు రాసుకొచ్చారు.
రాజ్ కపూర్ ను కాదని సునీల్ దత్ ను వివాహం చేసుకోవడంతో రాజ్ కపూర్ కుమిలిపోయాడు. నర్గీస్ ను మరిచిపోలేక బాత్ రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేవాడట. ఓ సారి తన గుండెలోనుంచి గాయాన్ని మర్చిపోలేక సిగరేటుతో తన చేతిపై కాల్చుకున్నాడట. మధు జైన్ రాసిన పుస్తకంలో నర్గీస్ తో విడిపోయిన తర్వాత రాజ్ కపూర్ పరిస్థితి గురించి చాలా చక్కగా వివరించారు. ఓ సందర్బంలో రాజ్ కపూర్ జర్నలిస్టులతో మాట్లాడుతూ..నేను నర్గీస్ కు ద్రోహం చేశానని అందరూ అనుకుంటున్నారు..కానీ నేను నర్గీస్ ను దూరం చేసుకోలేదు..ఆమెనే నాకు ద్రోహం చేసిందన్న నిజాన్నిచెప్పాడట. నర్గీస్ పెళ్లి గురించి తెలుసుకున్న తర్వాత కూడా రాజ్ కపూర్ తన స్నేహితులకు చెప్పకుంటూ బోరున ఏడ్చాడట.
నర్గీస్ పెళ్లి జరిగిన తర్వాత పూర్తిగా మద్యానికి బానిసయ్యాడట. దీంతో కుటుంబ సభ్యులు ఆయన భార్య కృష్ణ కపూర్..రాజ్ కపూర్ పరిస్థితిని చూసి తీవ్రమనోవేదనకు గురయ్యేవారు. మద్యంమత్తులో చాలా సార్లు స్పృహతప్పి పడిపోవడం..గట్టిగా ఏడ్వడం..రాత్రంతా వెక్కి వెక్కి ఏడుస్తుండేవాడు.
అయితే దశాబ్దాల తర్వాత రాజ్ కపూర్ తన కుమారుడు రిషి కపూర్ పెళ్లికి రావాలని నర్గీస్ కు ఆహ్వానం పంపించాడు. ఇచ్చిన మాట ప్రకారం తన భర్తను తీసుకుని నర్గీస్ పెళ్లికి హాజరయ్యింది. కానీ ఎందుకో ఆమె అదోలా కనిపించింది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న రాజ్ కపూర్ భార్య తనను దగ్గరకు పిలిచింది. నా భర్త చాలా అందగాడు..రొమాంటిక్ వ్యక్తి కూడా. అందర్నీఆకర్షిస్తాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. ప్లీజ్ గతాన్ని వదిలేయు. దాన్ని తవ్వుకుంటూ కూర్చుని బాధపడకూడదు. మా ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి వచ్చాడు..ఇఫ్పుడ మనందరం ఫ్రెండ్స్ అని చెప్పింది.
ఈ విషయాలన్నింటిని రిషి కపూర్ లో తన పుస్తకంలో రాసుకున్నాడు. అంతేకాదు తన తండ్రి వైజయంతిమాల అనే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండేవారని కూడా రాసాడు. కానీ రాజ్ కపూర్ ను , నర్గీస్ ఎందుకు మోసం చేసిందన్న విషయం మాత్రం క్లారిటీ లేదు. చివరకు 1988లో రాజ్ కపూర్ కన్నుమూశారు.