Manchu Family: మంచు ఇంట్లో మళ్లీ మంటలు..పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్
Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజేసుకున్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
Manchu Family: మంచు కుటుంబంలో మళ్లీ మంటలు రాజేసుకున్నాయి. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మనోజ్ తాజా స్టేట్ మెంట్ అందుకు నిదర్శనమని చెప్పవచ్చు. శనివారం తన కుటుంబంలో చోటుచేసుకున్న ఘటన గురించి ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విష్ణు తన ఇంటి దగ్గర జనరేటర్ లో పంచదార పోయించారని కరెంటు నిలిపివేశారని ఆరోపించారు.
శనివారం నేను సినిమా షూటింగ్ లో ఉన్నారు. కుమారుడి పాఠశాల ఈవెంట్లో నా భార్య హాజరైంది. మా అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో నా అన్న విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయ్ రెడ్డిలతోపాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించాడని..మేమంతా ఆందోళనకు గురయ్యామని తెలిపారు.
ఇంట్లో అమ్మ, నా కుమార్తె, కుమార్తె అత్తమామలు ఉన్నారు. ఈ చర్యతో అగ్నిప్రమాదం సంభవించే ఛాన్స్ కూడా ఉంది. జనరేటర్ల సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉంది. విష్ణు టీమ్ ఇంటి నుంచి వెళ్లిపోతూ నా దగ్గర పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేశారు. ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నాను అంటూ మనోజ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.