Bigg Boss 8 Telugu: ఈసారి బిగ్‌బాస్‌ ఫినాలే చీఫ్‌ గెస్ట్‌ ఎవరు.? అల్లు అర్జున్‌ హాజరవట్లేదా.

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది.

Update: 2024-12-15 04:12 GMT

Bigg Boss 8 Telugu

Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది. దీంతో ఈ సీజన్‌ టైటిల్‌ ఎవరు అందుకోనున్నారన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోయింది. ప్రస్తుతం బిగ్‌బాస్‌ టైటిల్‌ కోసం నిఖిల్‌, ప్రేరణ, గౌతమ్‌, అవినాష్‌ టైటిల్‌ కోసం పోటీపడుతున్నారు. వీరిలో గౌతమ్‌, నిఖిల్‌లో ఎవరో ఒకరు టైటిల్‌ను అందుకోనున్నారని అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈసారి బిగ్‌బాస్‌ హౌజ్‌లో మొదట 14 మంది ఎంటర్‌ కాగా తర్వాత వైల్డ్‌ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో 8 మందితో కలిపి మొత్తం 22 మంది హౌజ్‌లో సందడి చేశారు. సెప్టెంబర్‌ 1వ తేదీన మొదలైన ఈ షోలో చివరికి ఐదు మంది మిగిలారు. అయితే ప్రతీ ఏటా ఎవరో ఒక చీఫ్‌ గెస్ట్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ విన్నర్‌ను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి ఐకాన్‌ స్టార్ అల్లుఅర్జున్‌ బిగ్‌బాస్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే చివరి క్షణంలో ఇది క్యాన్సల్‌ అయినట్లు తెలుస్తోంది. పుష్ప2 విడుదల నేపథ్యంలో సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయిన కేసులో అల్లు అర్జున్‌ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కోర్టు బెయిల్‌ ఇచ్చినా బన్నీ ఒక రాత్రి జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే బన్నీని పెద్ద ఎత్తున సినీ తారలు పరామర్శించేందుకు వచ్చారు. దీంతో శనివారం అంతా బన్నీ బిజీగా గడిపాడు.

ఈ నేపథ్యంలోనే అల్లుఅర్జున్‌ బిగ్‌బాస్‌ షోకు హాజరుకాలేకపోవొచ్చని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి చీఫ్‌ గెస్ట్ లేకుండానే బిగ్‌బాస్‌ విన్నర్‌ టైటిల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో లాగే ఈసారి కూడా హోస్ట్ నాగార్జున చేతులమీదుగానే విన్నర్‌కు ట్రోఫీ ఇచ్చేయనున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News