Allu Arjun: బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యమెందుకు? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Allu Arjun: అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినా ఆయన ఒక రాత్రి చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు.

Update: 2024-12-14 08:47 GMT

Allu Arjun: బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యమెందుకు? నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Allu Arjun: అల్లు అర్జున్ (allu arjun)కు తెలంగాణ హైకోర్టు (Telangana high court)బెయిల్ మంజూరు చేసినా ఆయన ఒక రాత్రి చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని అల్లు అర్జున్ న్యాయవాదులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తామని వారు ప్రకటించారు. బెయిల్ (bail) ఆర్డర్ నుండి అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యేవరకు ఏం జరిగిందో ఓసారి చూద్దాం.

హైకోర్టు తీర్పు వచ్చే సమయానికి చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ డిసెంబర్ 13న తీర్పును వెల్లడించింది. ఈ తీర్పు వెల్లడించే సమయానికి తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అల్లు అర్జున్ ను భారీ బందోబస్తుతో చంచల్ గూడ జైలుకు తరలించారు. అదే సమయంలో తెలంగాణ హైకోర్టులో అల్లు అర్జున్ లంచ్ మోషన్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

బెయిల్ ఆర్డర్ అప్ లోడ్ కావడానికి ఎంత సమయం కావాలి?

అల్లు అర్జున్ కేసులో జైలు సూపరింటెండ్ వద్ద రూ. 50 వేల బాండ్ సమర్పించాలని హైకోర్టు సూచించింది.ఈ బాండ్ సమర్పించిన తర్వాత ఆయన విడుదలకు ఇబ్బంది లేదు. అయితే హైకోర్టు తీర్పు ఆర్డర్ కాపీ జైలు అధికారులకు రాత్రి 10 గంటల వరకు కూడా అందలేదు. బెయిల్ ఆర్డర్ ను ఉద్యోగులు ఆన్ లైన్ లో లోడ్ చేస్తారు. ఒక్క రోజులో జడ్జి ఇచ్చిన ఆర్డర్లను వరుసక్రమంలో ఆన్ లైన్ అప్ లోడ్ చేస్తారు. ఇలా ఆర్డర్ పొందడం సామాన్యులకు ఒకటి నుంచి రెండు రోజుల సమయం పడుతుంది. కానీ,అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ కాపీ ఆన్ లైన్ లో గంటల వ్యవధిలో అప్ లోడ్ అయింది. కానీ, అప్పటికే సమయం మించిపోయింది.దీంతో జైలు అధికారులు డిసెంబర్ 13 రాత్రి ఆయనను జైలు నుంచి విడుదల చేయలేదు.

జైలు అధికారులు ఏం చేస్తారు?

సాధారణంగా సాయంత్రం ఐదు గంటలలోపుగా బెయిల్ ఆర్డర్లను మ్యానువల్ గా జైలు బయట ఉన్న బాక్స్ లో వేస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత విడుదలకు అవసరమైన ప్రక్రియను జైలు అధికారులు పూర్తి చేస్తారు. బెయిల్ ఆర్డర్ మ్యానువల్ గా అప్ లోడ్ చేసినా ఆ ఆర్డర్ నిర్ధారించుకోవడానికి జైలు అధికారులు ఆన్ లైన్ లో కోర్టు నుంచి అప్ లోడ్ చేసిన ఆర్డర్ ను సరిచూసుకుంటారు. ఆ తర్వాతే జైలు నుంచి విడుదలకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. అల్లు అర్జున్ బెయిల్ ఆర్డర్ డిసెంబర్ 13 రాత్రి అప్ లోడ్ అయింది. డిసెంబర్ 14 ఉదయం 5 గంటలకు ఈ ఆర్డర్ ను అధికారులు పరిశీలించి ఆయనను జైలు నుంచి విడుదల చేశారు.

Tags:    

Similar News