Tammareddy Bharadwaja: జాతీయ అవార్డు వచ్చిందని.. తప్పు చేస్తే వదిలేయాలా? బన్నీ వల్లే ఘటన జరిగింది: తమ్మారెడ్డి భరద్వాజ్

Tammareddy Bharadwaja: సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, కోర్టు బెయిల్ ఇవ్వడం.. చంచల్ గూడ జైలు నుంచి బయటకు రావడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే.

Update: 2024-12-15 05:41 GMT

Tammareddy Bharadwaja: సంధ్య థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, కోర్టు బెయిల్ ఇవ్వడం.. చంచల్ గూడ జైలు నుంచి బయటకు రావడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అల్లు అరెస్ట్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఒక ప్రాణం పోయింది.. ఇక్కడ ఎవరున్నారనేది చూడము కాదు. ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే అన్నారు. సోషల్ మీడియాలో ఈ అరెస్టుపై భిన్న రకాల వాదనలు కూడా వినిపించాయి. మొదటిసారిగా ఒక సెలబ్రిటిని అరెస్ట్ చేయడం పై కొంతమంది ముఖ్యమంత్రిని పొగిడితే.. మరికొంత మంది అల్లు అర్జున్ చేసిన నేరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కక్ష్య సాధింపు చర్యని మరికొంతమంది అంటున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఘటనపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. మీడియా డిబేట్ లో ఆయన మాట్లాడారు. అసలు తన దృష్టిలో అయితే అల్లు అర్జున్ పీఆర్ టీమును అరెస్టు చేయాలన్నారు. ఇంత హడావుడి చేసినందుకే ఆ ఘటన జరిగిందన్నారు. అల్లు అర్జున్ నార్మల్ గా వెళ్లి ఉన్నట్లయితే ఇలా జరిగి ఉండేది కాదన్నారు. బన్నీ వస్తున్నారని ముందే లీక్ చేయడంతో ఇలా జరిగిందన్నారు.

జాతీయ అవార్డు వచ్చిన వారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి చెడ్డపేరు కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తప్పు ఎవరు చేసినా తప్పే కదా.. జాతీయ అవార్డు వచ్చిందని, భారత రత్న ఇచ్చామని ఒక మనిషిని చంపితే వారిని వదిలిపెట్టలేము కదా . తప్పు ఎవరు చేసిన తప్పే అన్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కు పూర్తి సంబంధం లేకున్నా ఆయన వెళ్లడం వల్లే ఇలా జరిగింది కాబట్టి నైతిక బాధ్యత అయితే బన్నీకే ఉంటుందన్నారు.

అయితే గతంలో చిరంజీవి సినిమాలకు ఇలా జరిగిందని అడిగిన ప్రశ్నకు థియేటర్లలో టికెట్లు తీసుకుంటుండగా తొక్కిసలాటలో జరిగింది. ఆ సమయంలో థియేటర్ యాజమాన్యంది తప్పు అవుతుంది.. ఎందుకంటే అక్కడి చిరంజీవి వెళ్లలేదు కదా అని విశ్లేషించారు. 

Tags:    

Similar News