Rashmika Mandanna: పుష్ప 3లో విజయ్ దేవరకొండ..రష్మిక రియాక్షన్ ఇదే

Update: 2024-12-15 04:25 GMT

 Rashmika Mandanna: అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప2 మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ లోనూ పుష్ప 2 సినిమా రికార్డులను బద్దలుకొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జెట్ స్పీడ్ దూసుకుపోతోంది. మూవీవిడుదలైన 6 రోజుల్లోనే రూ. వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా అడుగుపెట్టి రికార్డు క్రియేట్ చేసింది.

అయితే పుప్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ కు కొనసాగింపుగా పుష్ప 3 ర్యాంపేజ్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పార్ట్ 2 క్లైమాక్స్ లో ఆ విషయాన్ని తెలియజేస్తూ అల్లు అర్జున్ ఒక వ్యక్తిపై బాంబు దాడికి పాల్పడినట్లుగా చూపించారు. ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ అని పుప్ప 3లో ఆయన హీరోగా కనిపించే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మీక రియాక్షన్ ఏంటో చూద్దాం.

ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడారు. తనకు ఈ విషయం తెలియదని చెప్పారు. డైరెక్టర్ సుకుమార్ ప్రతి విషయంలోనూ సస్పెన్స్ కొనసాగిస్తుంటారని..చివరి వరకు విషయాన్ని బయటపెట్టరన్నారు. పుష్ప 2కు సంబంధించిన విషయాలను కూడా షూటింగ్ సమయంలోనే తమకు చెప్పేవారన్నారు. సినిమా క్లైమాక్స్ లో కనిపించిన వ్యక్తిని చూపి అతనేవరో అని తాను షాక్ అయినట్లు పేర్కొన్నారు. ప్రేక్షకుల వలే తాను కూడా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నట్లు  తెలిపారు. 

Tags:    

Similar News