Manchu Manoj: మీడియా తప్పేలేదు..నేను పిలిస్తేనే వచ్చారు..మోహన్ బాబుకు మరో షాకిచ్చిన మనోజ్
Manchu Manoj: ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో జరిగిన గొడవ గురించి అందరికీ తెలిసిందే. ఆ గొడవను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడికి దిగిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనలో ఓ ప్రముఖ ఛానెల్ ప్రతినిధిపై దాడి చేశారు మోహన్ బాబు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో మోహన్ బాబు రౌడీయిజం చూపించారంటూ క్షమాపణ చెప్పాలని జర్నలిస్టులు, జర్నలిస్టుసంఘాలు ధర్నాకు దిగాయి.
అయితే మొదట తన తప్పేలేదని..తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న మోహన్ బాబు.. తర్వాత ఒక్కో మెట్టు దిగి క్షమాపణ చెప్తూనే ఆ దాడి కావాలని చేసిందని కాదని..క్షణికావేశంలో జరిగిందంటూ చెప్పుకువచ్చే ప్రయత్నం చేశారు. దాదాపు 30 నుంచి 50 మంది ప్రైవేటు వ్యక్తులు, సంఘ వ్యతిరేక శక్తులు తన ఇంటి గేటు తీసుకుని లోపలికి వచ్చారని..మాకు హాని చేసేందుకు ఇంట్లోకి వచ్చారన్న సంగతి తెలుసుకుని తాను సహనం కోల్పోయానని చెప్పారు.
అయితే మోహన్ బాబు పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఎఐఆర్ కూడా పైల్ చేశారు. అయితే మీడియాపై దాడి విషయాన్ని మంచు మనోజ్ మీడియాతో మాట్లాడారు. తన తండ్రికి వ్యతిరేకంగా మరో బాంబు పేల్చాడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన జర్నలిస్టుపై దాడి ఘటనలో మీడియా తప్పులేదని..తానే వారిని లోపలికి తీసుకెళ్లానని స్పష్టం చేశారు. నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను కాబట్టి నాకు సహాయంగా వారిని లోపలికి తీసుకోని వెళ్లాను. మా ఇంట్లోకి నన్ను రానివ్వకపోవడంతోనే నేనే మీడియాను వెంటబెట్టుకుని వెళ్లానంటూ చెప్పుకొచ్చాడు.