Mrunal Thakur: ప్రభాస్‌కు జోడిగా సీతారామమ్ బ్యూటీ..ఏ సినిమా అంటే?
Mrunal Thakur: తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పిరిట్ లో డార్లింగ్ కు జోడిగా సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Mrunal Thakur: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే అదే ఊపును కంటిన్యూ చేస్తున్నారు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా చేతినిండా బోలేడు సినిమాలతో గడుపుతున్నారు.
ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోల లిస్టులో ప్రభాస్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఇక ప్రభాస్ చివరి సినిమా సలార్. ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. ఇప్పుడు స్పిరిట్, సలార్ 2, రాజాసాబ్ వంటి సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు.
ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ మూవీ షూటింగ్ లో ఉన్నారు. ఈ మూవీ తర్వాత సందీప్ డైరెక్షన్ స్పిరిట్ అనే మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకా షురూ కాలేదు. కానీ ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దాదాపు స్క్రిప్టును కంప్లీట్ చేసినట్లు సమాచారం.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పిరిట్ లో డార్లింగ్ కు జోడిగా సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఓకే చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చలు జరిగాయని..సందీప్ రెడ్డి వంగా ఒకే అంటే వెంటనే అగ్రమెంట్ రాసుకుంటారని సమాచారం. మృణాల్ ఠాకూర్ పలు సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. దీంతో ఆమె పేరు ఫైనల్ కానున్నట్లు తెలుస్తోంది.