NCB Confirms : అవును.. రకుల్ పేరు రియా చెప్పింది నిర్ధారించిన ఎన్‌సీబీ!

NCB Confirms : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది. ఈకేసులో A1 నిందితురాలుగా ఉన్న

Update: 2020-09-15 06:43 GMT
NCB Confirms : అవును.. రకుల్ పేరు రియా చెప్పింది నిర్ధారించిన ఎన్‌సీబీ!

Rakul Preet Singh 

  • whatsapp icon

NCB Confirms : బాలీవుడ్ దివంగంత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతుంది. ఈకేసులో A1 నిందితురాలుగా ఉన్న రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో భాగంగా నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) ఇటివల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. ఆమెతో పాటుగా ఆమె సోదరుడు షోవిక్‌, శామ్యూల్‌ మెరిండాతోపాటు మరి కొంతమందిని అరెస్టు చేసి, ఎన్‌సీబీ విచారణ చేస్తోంది. అయితే ఎన్‌సీబీ చేసిన విచారణలో రియా చక్రవర్తి 25 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా వెల్లడించిందని అందులో టాలీవుడ్ నుంచి రకుల్ పేరు ఉందని వార్తలు షికార్లు కొట్టాయి. దీనితో రకుల్‌ప్రీత్‌పై నెటిజన్లు అనేక కామెంట్లు చేస్తూ వచ్చారు.

అయితే రియా చక్రవర్తి వెల్లడించిన పేర్లలో రకుల్‌, సారా పేర్లు లేవని ఎన్‌సీబీ ఇటివల వెల్లడించింది. ఇప్పుడు వారిద్దరి పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లుగా సోమవారం అధికారికంగా వెల్లడించింది ఎన్‌సీబీ. వారిద్దరితో పాటు డిజైనర్‌ సిమోనె ఖంబట్టాల పేరు కూడా చెప్పినట్టుగా ఎన్‌సీబీ వెల్లడించింది. ఈ విషయాన్ని ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రా వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి వారికి ఎలాంటి సమన్లూ పంపలేదని వెల్లడించారు. ఇక రియా చెప్పిన 25 మంది లిస్టును కూడా ఇంకా తయారు చేయలేదని తెలిపారు. మళ్ళీ రకుల్ పేరు బయటకు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

అటు ఈ కేసులో మరో ఆరుగురిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. దీనితో అరెస్ట్ అయిన వారి సంఖ్య 16కి చేరుకుంది. ముంబయికి చెందిన కరమ్‌జీత్‌సింగ్‌ ఆనంద్‌, డ్వేన్ ఫెర్నాండెజ్, సంకేత్‌ పటేల్, అంకుష్ అన్రేజా, సందీప్ గుప్తా, అఫ్తాబ్ ఫతే అన్సారీని అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు అధికారులు.. ఈ ఆరుగురికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. వీరందరిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. అరెస్టు చేసిన వారిని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నేడు ఎసిఎంఎం కోర్టులో హాజరుపరచనున్నారు.  

Tags:    

Similar News