Nani: గుండె బరువెక్కింది.. నాని ఎమోషనల్ పోస్ట్
Nani: గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్ పోస్ట్
Nani: నటుడు నాని కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘జెర్సీ’ఒకటి. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన క్రికెటర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్ షో వేశారు. దీనికి, నాని-అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తోన్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.