Rajakumarudu Completes 21 Years : మహేష్ బాబు రాజకుమారుడుకి 21 ఏళ్ళు..!
సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది సినిమాలో నటించిన మహేష్ బాబు
Rajakumarudu Completes 21 Years : సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు మహేష్ బాబు.. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది సినిమాలో నటించిన మహేష్ బాబు సోలో హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.. ఈ సినిమా 1999 జూలై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమాకి నేటితో 21 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..
♦ మహేష్ బాబు డెబ్యూ సినిమాని డైరెక్ట్ చేయడానికి చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారు. కానీ హీరో కృష్ణ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావును మాత్రమే ఎంచుకున్నారు..
♦ రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోలలో మహేష్ బాబు రెండోవాడు.. అంతకుముందు కలియుగ పాండవులు సినిమాతో వెంకటేష్ ని హీరోగా పరిచయం చేశారు అయన.
♦ ఈ సినిమాలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ భామ ప్రీతిజింటా హీరోయిన్ గా నటించింది.. అంత ముందు ప్రీతిజింటా తెలుగులో వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా అనే సినిమాలో నటించింది. ఇక రాజకుమారుడు సినిమా తర్వాత మళ్లీ ఆమె టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు.
♦ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. సుమారుగా అయిదు కోట్లతో ఈ సినిమాని తెరకెక్కిస్తే.. దాదాపుగా 11కోట్లను వసూలు చేసింది ఈ చిత్రం..
♦సినిమా రిలీజ్ కు ముందే మణిశర్మ అందించిన సంగీతం బాగా క్లిక్ అయ్యాయి.. ఇక ఆ తరవాత చాలా సినిమాలకి మణిశర్మనే తన సంగీత దర్శకుడి గా ఎంచుకున్నాడు మహేష్ బాబు.
♦ఈ సినిమాని 116 సెంటర్స్ లలో 78 ప్రింట్లతో రిలీజ్ చేశారు. 80 సెంటర్లలో పైగా 50 రోజులు, 44 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
♦ఈ సినిమాకు అక్కినేని ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది. ఇదే సినిమాని హిందీలోకి ప్రిన్స్ నంబర్ 1 పేరుతో అనువాదం చేశారు.
♦ఈ సినిమా కమర్షియల్ హిట్ కావడంతో మహేష్ వెంటవెంటనే రెండు సినిమాలకి ఒకే చెప్పాడు.. అవే యువరాజు, వంశీ
♦ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వనప్పటికి మురారి సినిమాతో మళ్లీ మహేష్ కెరీర్ గాడిన పడింది.