అకట్టుకుంటున్న 'సరిలేరు నీకెవ్వరు' ఆంథమ్

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్

Update: 2019-12-23 12:17 GMT

అగ్ర కథానాయకుడు మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు . ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనిలో బిజీ అయిపొయింది. అందులో భాగంగానే ఇప్పటికే సినిమా నుంచి మూడు పాటలను వదిలిన చిత్ర బృందం తాజాగా మరో సాంగ్ ని విడుదల చేసింది.

నాలుగో పాటగా సైనికుల విలువలను, త్యాగాలను గుర్తుచేస్తూ ఓ పాటను విడుదల చేసింది. ఈ పాట నన్ను చాలా ఆకట్టుకుందని కథానాయకుడు మహేష్ బాబు రీట్వీట్ చేశారు. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రాయగా, శంకర్ మహదేవన్ ఆలపించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ పాటను ప్రత్యేకంగా యూరప్ వెళ్లి అక్కడ కళాకారులతో కలిసి కంపోజ్ చేశారు దేవీ.

ఇందులో మహేష్ బాబు ఇండియన్ ఆర్మీ పాత్రలో కనిపించనున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, సంగీత, విజయశాంతి, రావు రమేష్ ప్రాధాన పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 11 న రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజు అనిల్ సుంకరలతో కలసి మహేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి దర్శకుడు 

Full View

Tags:    

Similar News