Zakir Hussain passes away: జాకీర్ హుస్సేన్ మరణానికి.. కారణమైన ఈ అరుదైన వ్యాధి గురించి తప్పక తెలుసుకోవాలి!

Update: 2024-12-16 03:48 GMT

Zakir Hussain passes away: ప్రముఖ తబలా వాద్యకారుడు జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ దిల్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ ఈ లోకాన్ని విడిచివెళ్లారు. సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలందించిన జాకీర్ హుస్సేన్ ను తీవ్రమైన వ్యాధి కబళించింది. ఆయన మరణానికి కారణమైన వ్యాధి ఏంటో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రీయ సంగీతంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును అందించిన మాస్ట్రో, ప్రసిద్ధ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్ ఇక మన మధ్య లేరు. జాకీర్ హుస్సేన్ 73 సంవత్సరాల వయస్సులో మరణించారు. జాకీర్ హుస్సేన్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ అధిక రక్తపోటుతో బాధపడేవారు. దీంతో ఆయనకు గుండె సంబంధిత సమస్యలు వచ్చాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఆయన గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందారు.వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం, జాకీర్ హుస్సేన్ 'ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్' అనే అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, దీని కారణంగా సమస్యలు తలెత్తాయని అతని కుటుంబం ఒక ప్రకటనలో తెలిపినట్లు పేర్కొంది.

ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ (IPF) అంటే ఏమిటి?

ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, ఆక్సిజన్ మన ఊపిరితిత్తులలోని చిన్న గాలి సంచుల ద్వారా రక్తంలోకి వెళుతుంది. అక్కడి నుండి శరీరంలోని అన్ని భాగాలకు చేరుకుంటుంది. కానీ IPF సంభవించినప్పుడు, ఊపిరితిత్తుల లోపల మచ్చ కణజాలం పెరగడం ప్రారంభమవుతుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య తీవ్రమవుతుంది. దీని కారణంగా, ఊపిరితిత్తుల ద్వారా రక్తంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. దీని కారణంగా మీ శరీరంలోని ఇతర భాగాలు సరిగా పనిచేయలేవు.

ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్‌కు చికిత్స లేదని వైద్యులు తెలిపారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే, ఊపిరితిత్తుల మార్పిడి అనేది ఒక ఆప్షన్. క్రమంగా ఊపిరితిత్తులలోని కణజాలాలు పెరగడం ప్రారంభించి..ఊపిరితిత్తులు గాయాలలాగా మారుతాయి. దీని కారణంగా ఛాతీ నొప్పి లేదా దృఢత్వం, కాళ్ళలో వాపు, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, దగ్గు, అలసట, కీళ్ళు, కండరాలలో నొప్పి, బరువు తగ్గడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వేధిస్తుంటాయి. అంతేకాదు ఏదైనా ఇతర వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఇబ్బందులు మరింత పెరుగుతాయి. ఇప్పుడు జాకీర్ హుస్సేన్ కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొన్నారు. ఇంతకుముందు అధిక బీపీ, గుండె సంబంధిత సమస్యలతోపాటు ఊపిరితిత్తుల వ్యాధి కూడా సోకడంతో ఆయన కోలుకోలేకపోయారు.

Tags:    

Similar News