Bigg Boss Winner: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ట్రోఫీ, ప్రైజ్‌మనీ, కారు, ఇంకా పారితోషికం ఎంతంటే?

Nikhil Maliyakkal: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ విజయవంతంగా ముగిసింది. సుమారు 3 నెలలపాటు ప్రేక్షకులను పలకరించిన ఈ రియాలిటీ షో ఆదివారం ముగిసింది.

Update: 2024-12-16 05:18 GMT

Bigg Boss Winner: బిగ్ బాస్ విజేతగా నిఖిల్.. ట్రోఫీ, ప్రైజ్‌మనీ, కారు, ఇంకా పారితోషికం ఎంతంటే?

Nikhil Maliyakkal: బిగ్‌బాస్‌ తెలుగు 8వ సీజన్‌ విజయవంతంగా ముగిసింది. సుమారు 3 నెలలపాటు ప్రేక్షకులను పలకరించిన ఈ రియాలిటీ షో ఆదివారం ముగిసింది. మొదట 14 మందితో ప్రారంభమైన బిగ్‌బాస్‌(Bigg Boss) హౌజ్‌లోకి తర్వాత మరో 8 మంది వైల్డ్‌ కార్డ్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌజ్‌లో మొత్తం 22 మంది సందడి చేశారు. సెప్టెంబర్‌ 1వ తేదీన ప్రారంభమైన షో తొలి నుంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చింది. హౌజ్‌మేట్స్‌ మధ్య జరిగిన గొడవలు, అలకలు ప్రేమలు ఇలా సందడి సందడిగా సాగింది.

ఇన్ని రోజుల పాటు సందడిగా సాగిన బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ ఆదివారంతో ముగిసింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలుత ఈ గ్రాండ్‌ ఫినాలేకు అల్లు అర్జున్‌(Allu Arjun) ముఖ్య అతిథిగా హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ చివరిలో అనివార్య కారణాలతో రామ్‌ చరణ్‌ హాజరయ్యారు. టాప్‌5లో నిలిచిన వారిలో మొదట అవినాశ్ ఎలిమినేట్ కాగా ఆ తర్వాత ప్రేరణ, నబీల్ బయటకు వచ్చేశారు. దీంతో టాప్ -2లో గౌతమ్, నిఖిల్ నిలిచారు.

దీంతో వీరిద్దరిలో టైటిల్‌ విన్నర్‌గా నిఖిల్‌(Nikhil) నిలిచినట్లుగా ప్రకటించారు. కాగా గౌతమ్ కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. తన అద్భుత ఆట తీరుతో నిఖిల్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పేరుకు కన్నడ నటుడు అయినా తెలుగు వారి హృదయాలను దోచుకున్నాడు. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంతో పాటు, టాస్కుల విషయంలో కూడా తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. ఇక టైటిల్‌ విన్నర్‌గా నిలిచిన నిఖిల్‌ ప్రైజ్‌ మనీగా రూ. 55 లక్షల చెక్‌ అందుకున్నాడు. టైటిల్‌ విన్నర్‌గా ప్రకటించగానే నిఖిల్‌ సంతోషం వ్యక్తం చేశాడు.

విజయాన్ని తన పేరెంట్స్‌కు అంకింత చేశాడు. ఇక ప్రైజ్‌ మనీతో పాటు నిఖిల్‌ మారుతి డిజైర్‌ కారును కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇన్ని వారాలు ఉన్నందుకు అదనంగా అమౌంట్‌ పొందాడు. నిఖిల్‌ వారానికి రూ. 2.25 లక్షల పారితోషం పొందాడు. మొత్తం 15 వారాలకు గాను సుమారు రూ. 33,75,000 సొంతం చేసుకున్నాడు. ఈ లెక్కన చూస్తే నిఖిల్‌ మొత్తం రూ. 88 లక్షలతో పాటు ఒక కారును సొంతం చేసుకున్నాడు.


Tags:    

Similar News