Zakir Hussian: తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) కన్నుమూశారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం నాడు ఆయన ఆసుపత్రిలో చేరారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
ప్రముఖ తబలా వాద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. ఆదివారం అతని పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించింది. ఆయనను వెంటనే అమెరికాలోని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.1951 మార్చి 9న ముంబైలో జన్మించిన జాకీర్ హుస్సేన్ సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలను అందించారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో తన కెరీర్ గురించి చాలా విషయాలను చెప్పుకొచ్చారు. తన మొదటి గురువు తన తండ్రే అని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన జాకీర్ హుస్సేన్ తన ప్రాధాన్యతల గురించి గతంలో చాలా విషయాలను పంచుకున్నారు. ఎన్ని అవార్డులు వచ్చినా..ఎప్పుడూ నేర్చుకోవడం చాలా ముఖ్యం. మనలను మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని మా నాన్న చెప్పేవారు. అప్పుడే విజయం సాధిస్తారు అనేవారు. నేను గొప్ప సంగీతి విద్యాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉందామని చెప్పారు. వారి మాటలు నాలో స్పూర్తినింపాయి. నా రంగంలో నేను బెస్ట్ గా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి అలోచించలేదు. నా కంగే గొప్ప తబలా విద్యాంసుల పేర్లు చెప్పమంటే 15మంది పేర్లను చెబుతాను అంటూ చెప్పుకొచ్చారు.
* జాకీర్ హుస్సేన్ 3ఏళ్ల వయస్సులోనే తబలా వాయించడం నేర్చుకున్నారు. 7ఏళ్ల వయస్సులోనే బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు.
*12ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ కచేరీలు ప్రారంభించారు.
*హిందూస్తానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ప్యూజన్ లో నైపుణ్యం సాధించి తనదైన ముద్రను వేశారు.
*సంగీతంలో రాణిస్తూనే చదువుపై శ్రద్దను పెట్టారు. ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
*2009లో మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్ అల్బమ్ చేసినందుకు ఆయనకు గ్రామీ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును అందుకున్న కొంతమంది ప్రముఖుల్లో జాకీర్ హుస్సేన్ ఒకరు.
*2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డుల్లో ఒక రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన భారతీయుడిగా జాకీర్ హుస్సేన్ హిస్టరీ క్రియేట్ చేశారు.
* 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మనదేశంతోపాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఆయన పనిచేశారు.
*కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఎన్నో సార్లు ప్రదర్శనలు ఇచ్చి విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు.