Keerthy Suresh:హాలీవుడ్ సినిమా రేంజ్ లిప్ లాక్.. రిసెప్షన్లో కీర్తి సురేశ్ పెట్టిన కిస్ ఫొటో వైరల్!
Keerthy Suresh: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ ఈమధ్యే దుబాయ్ కు చెందిన బడా వ్యాపారవేత్తను వివాహంచేసుకుంది. 15ఏళ్ల వీరి పరిచయం కాస్త మూడుముళ్ల బంధం వరకు చేరింది. సంప్రదాయ పద్దతిలో ఘనంగా చేసుకుంది ఈ బ్యూటీ. అయితే పెళ్లి సందడి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ భామ రిసెప్షన్ మూడ్ లో ఉంది. అదివారం కీర్తి సురేశ్, ఆంథోనిల రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది.
ఈ రిసెప్షన్ లో కీర్తి వైటు గౌనులో దేవకన్యాలా మెరిసిపోయింది. ఆమె భర్త ఆంథోని కూడా వైట్ ప్యాంట్, సూట్ లో యువరాజులా రెడీ అయ్యారు. ఈ పార్టీ ఫొటోలను కీర్తి తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. పార్టీలో తన భర్తతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది కీర్తి. ఇష్టపడినవాడిని మనువాడగానే ఆనందం కీర్తిముఖంలో కొట్టొచ్చినట్లు కనిపించింది. ఇక పార్టీ వైబ్ కనిపించేలా క్రిస్టియన్ సంప్రదాయంలో వీరిద్దరూ ఒకరినొకరు లిప్ లాక్ కిస్ పెట్టేసుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ లో లిప్ లాక్ కిస్ పెట్టుకున్న ఈ జంట ఫొటోలను చూసి అభిమానులు సంతోషిస్తున్నారు. కీర్తిసురేష్ రొమాంటిక్, గార్జియస్ అంటూ ఫొటోలపై కుర్రవాళ్లు కాంప్లిమెంట్‌స్ తోపాటు విషెస్ కూడా చెబుతున్నారు.