Ilayaraja: శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఇళయరాజా ఎంట్రీ వివాదం

ఆలయంలోని అర్ధమండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆలయ సిబ్బంది చెప్పారు.

Update: 2024-12-16 08:53 GMT

Ilayaraja: ఇళయరాజా(ilayaraja) తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ (srivilliputhur temple) ఆలయాన్ని సందర్శించిన సమయంలో ఆయనను ఆలయం నుంచి బయటకు పంపినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అసలు ఏం జరిగింది?

ఆలయంలోని గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ మండపంలోకి ఆయన ప్రవేశించారు. అయితే అక్కడే ఉన్న సిబ్బంది ఆయనను అక్కడి నుంచి పంపారు. అర్ధ మండపం మెట్ల దగ్గర నిలబడి ఆలయ మర్యాదలను ఆయన స్వీకరించారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై చర్చ సాగుతోంది. ఆలయ అర్ధమండపంలోకి ఇళయరాజాను అనుమతించకపోవడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఆలయ సిబ్బంది ఏమన్నారంటే?

ఆలయంలోని అర్ధమండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆలయ సిబ్బంది చెప్పారు. ఆలయ నిబంధనలకు విరుద్దంగా అర్ధ మండపంలోకి ఎవరూ ప్రవేశించడానికి వీల్లేదని తెలిపారు. ఇళయరాజా అనుకోకుండా అర్ధమండపంలోకి ప్రవేశించారని.. ఇది గుర్తించిన సిబ్బంది అక్కడి నుంచి ఆయనను అక్కడి నుంచి పంపారని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News