Kajal Aggarwal: ఘోస్టీ తో షాక్ అయిన కాజల్ అగర్వాల్
Kajal Aggarwal: ఘోస్టీ సినిమా విషయంలో బాగా అప్సెట్ అయిన కాజల్
Kajal Aggarwal: ఈ మధ్యనే పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిన స్టార్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కొన్నాళ్ళు ఇండస్ట్రీ నుంచి గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టడానికి రెడీ అయింది. దాదాపు రెండేళ్లు సినిమాల నుంచి దూరంగా ఉన్న కాజల్ అగర్వాల్ మళ్లీ కమల్ హాసన్ సరసన "భారతీయుడు 2" సినిమాలో నటిస్తోంది.
అదే "ఘోస్టీ". కానీ ఈ సినిమా రిజల్ట్ కాజల్ కి పెద్ద షాకే ఇచ్చింది. నిజానికి ఈ సినిమాపై కాజల్ చాలానే అసలు పెట్టుకుంది. కానీ సినిమా ఫ్లాప్ అవుతుందని మాత్రం ఊహించలేదు. దీంతో ఈ సినిమా విషయంలో కాజల్ బాగా అప్సెట్ అయినట్టు తెలుస్తోంది. ఒకప్పుడు అటు తెలుగు మరియు ఇటు తమిళ్ భాషల్లో వరుస స్టార్ హీరో సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ కరియర్లో ముందుకు దూసుకు వెళ్లిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు కథ సెలక్షన్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉండటం అభిమానులను సైతం కలవరపరుస్తోంది.
కళ్యాణ్ డైరెక్ట్ చేసిన "ఘోస్టీ" సినిమా లో కాజల్ తో పాటు కోలీవుడ్ నటుడు యోగి బాబు నటించారు. కె.ఎస్ రవికుమార్, రెడిన్ కింగ్ స్లీ కూడా ముఖ్య పాత్రలలో పోషించారు. తమిళ్ లో ఈమధ్య విడుదలైన ఈ సినిమా వచ్చేవారం తెలుగులో కూడా విడుదల కాబోతోంది. మరి తమిళనాడు లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగులో సక్సెస్ అవుతుందో లేదో వేచి చూడాలి.