ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది : మంచు మనోజ్
దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలోని చటాన్‌పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. కాగా గత నెల 27న వెటర్నరీ వైద్యురాలిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద కాల్చివేశారు.
విచారణలో భాగంగా దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు నిందితులను తీసుకు వెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుండగా... వారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడు ఆరిఫ్, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో హీరో మంచు మనోజ్ ఎన్‌కౌంటర్ పై కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. నిందితులను చంపిన బుల్లెట్టను దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు అనే వార్తలో ఇంత కిక్కు ఉందా ? ఈ రోజే చెల్లెమ్మ దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని మనోజ్ ట్వీట్ చేసాడు. ఈ మధ్యే దిశా కుటుంబ సభ్యులను మనోజ్ పరామర్శించిన సంగతి తెలిసిందే.
ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది
— MM*🙏🏻❤️ (@HeroManoj1) December 6, 2019
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! #JusticeForDisha #Disha #justiceforpriyanakareddy pic.twitter.com/qQ05yD9mo3