Godfather: తక్కువ కలెక్షన్లతో "గాడ్ ఫాదర్" హిట్టా ఫట్టా?

Godfather: "గాడ్ ఫాదర్" కలెక్షన్లను ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యాయి

Update: 2022-10-30 03:55 GMT

Godfather: తక్కువ కలెక్షన్లతో "గాడ్ ఫాదర్" హిట్టా ఫట్టా?

Godfather: మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన "గాడ్ ఫాదర్" సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసింది. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ. 55.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీతో కలిపి రూ. 43 కోట్లు మాత్రమే సినిమా వసూళ్లు చేసిందని తెలుస్తోంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ 52.5 కోట్లు కలెక్ట్ చేయగా, హిందీ వెర్షన్ 4.50 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా "గాడ్ ఫాదర్" బడ్జెట్ మరియు కలెక్షన్స్ ని బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిందనే చెప్పాలి.

యూఎస్ఏ మార్కెట్ లో కూడా సినిమా 6.3 కోట్లకు అమ్ముడైతే కేవలం 5.30 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. నైజాం మరియు ఈస్ట్ లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ భారీగా నష్టపోయారని తెలుస్తోంది. "ఆచార్య" సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో 37.5 కోట్ల వరకూ రాబట్టగలిగింది. కానీ "గాడ్ ఫాదర్" సినిమా మాత్రం హిట్ టాక్ తో కూడా 43 కోట్ల వద్దే ఆగిపోవడం అభిమానులకు మాత్రమే కాక ట్రేడ్ వర్గాలకు కూడా షాకింగ్ గా ఉందని చెప్పాలి. దసరా సీజన్, లాంగ్ వీకెండ్ అన్నీ కలిసి వచ్చినప్పటికీ సినిమా భారీ వసూళ్లను రాబట్ట లేకపోయింది.

'గాడ్ ఫాదర్' సినిమా వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి:

నైజాం: 11.60 కోట్లు

సీడెడ్: 10 కోట్లు

UA: 6. 10 కోట్లు

గుంటూరు: 3. 85 కోట్లు

ఈస్ట్: 3. 90 కోట్లు

వెస్ట్: 2. 50 కోట్లు

కృష్ణా: 2. 75 కోట్లు

నెల్లూర్: 2. 30 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ: 43 కోట్లు

రెస్టాఫ్ ఇండియా: 7. 70 కోట్లు

ఓవర్సీస్: 6. 30 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా చిత్ర కలెక్షన్స్: 57 కోట్లు

Tags:    

Similar News