14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ నుంచి పరుశురామ్ కి లక్కి ఛాన్స్ ?
గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా.. డైరెక్టర్ పరుశురాం తర్వాత సినిమా ఏంటి అంటే ఇంకా ప్రశ్నగానే ఉంది. సినిమా
గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టినా.. డైరెక్టర్ పరుశురాం తర్వాత సినిమా ఏంటి అంటే ఇంకా ప్రశ్నగానే ఉంది. సినిమా విడుదలై సంవత్సరం అవుతుంది. చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పరుశురాంకి స్టార్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తారని అందరు అనుకున్నారు. మధ్యలో ప్రభాస్, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి కూడా .. కానీ అవి కేవలం వార్తల వరకే మిగిలిపోయాయి..
ఈ నేపధ్యంలో పరుశురాంకి 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ నుంచి బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అక్కినేని నాగచైతన్య, రష్మిక హీరోహీరోయిన్ గా పరశురామ్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమాకి గాను పరశురామ్ కి గాను పరుశురాంకి 14 రీల్స్ వాళ్ళు ఎనిమిది కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుందని సమాచారం... దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.