Daku Maharaj Trailer out: డాకు మహారాజ్ ట్రైలర్..కింగ్ ఆఫ్ జంగిల్ ఎలివేషన్స్ అదుర్స్
Daku Maharaj Trailer out: బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బాలయ్య బాబు విధ్వంసానికి ఈ సంక్రాంతి బ్యాక్సాఫీస్ బద్దలుకొట్టేలా ఉంది. బాబీ విజన్, బాలయ్య బాబు యాక్షన్, తమన్ మ్యూజిక్ డాకు మహారాజ్ ను మరోరేంజ్ కు తీసుకెళ్లాలా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే అన్ని అంశాలు జొప్పించి తీసినట్లుగానే అనిపిస్తోంది. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్నీ కూడా సమపాళ్లలో ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ ట్రైలర్ లో కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలయ్య బాబుకు ఇచ్చి ఎలివేషన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
బాబి బాలయ్య బాబును చాలా కొత్తగా చూపించాడు. ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. జై బాలయ్య, జై జై బాలయ్య..సంక్రాంతి ఇక ఊపిరి పీల్చుకో డాకు వచ్చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ కు ఎలా కావాలో అలా చూపించడంలో బాబీ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
ఈ ట్రైలర్ ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ లా మాత్రమే కాకుండా ఇంకా ఏదో స్పెషల్ యాక్షన్ సీక్వెన్స్ చేసినట్లు అనిపిస్తోంది. ఊర్వశీని గ్లామర్ పార్ట్ కోసం వాడుకున్నట్లు కనిపిస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ కూడా మంచి ఇంపార్టెంట్ రూల్ ను పోషించినట్లుగా అనిపిస్తోంది. బాబీ డియోల్ మాత్రం క్రూరమైన విలన్ గానే కనిపిస్తున్నాడు. వీరిద్దరి మధ్య పోటీ ఎలా ఉంటుందనేది జనవరి 12వ తేదీన తెలుస్తుంది.